గుంటూరు కారం ప్రమోషన్లు ఇంకా ఊపందుకోలేదు కానీ ఓ మై బేబీ పాటకు వచ్చిన నెగటివిటీని పోగొట్టేలా మెల్లగా వదులుతున్న మాస్ పోస్టర్లు డ్యామేజ్ ని పూర్తిగా రిపేర్ చేసే పనిలో పడ్డాయి. నిన్న మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ బిట్ కు సంబంధించిన ఫోటో చూసి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇవాళ టేబుల్ మీద మహేష్ బీడీ కాలుస్తూ వదిలిన స్టిల్ కొత్తగా లేకపోయినా హీరో పాత్రలోని మాస్ యాంగిల్ ని మరింత ఎలివేట్ చేసేలా అనిపించింది. నిర్మాత నాగవంశీ ఈసారి తెలివిగా అఫీషియల్ ఫ్యాన్ హ్యాండిల్స్ లో పోస్టర్ ని రిలీజ్ చేయడం మంచి ఎత్తుగడ. దానికి ఫలితం కనిపిస్తోంది.
ఇప్పటిదాకా పబ్లిసిటీ పరంగా గుంటూరు కారంకు హైప్ తీసుకొచ్చింది చిన్న టీజర్, పోస్టర్లే. అసలైన కంటెంట్ ఇంకా బయటికి రాలేదు. ట్రైలర్ కోసం కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. వచ్చే నెల 6న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడే లాంచ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోందట. ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉండటంతో ఇంకో వారం దాకా ఎవరూ బయటికి రాలేని పరిస్థితి. త్రివిక్రమ్ శ్రీనివాస్ వీలును బట్టి ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారట. మహేష్ మాత్రం సెలెక్టివ్ గా కన్పించేలా చూస్తున్నారు. సర్కారు వారి పాట అంత అగ్రెసివ్ ప్రమోషన్ ఉండకపోవచ్చు.
పోటీ ఎంత విపరీతంగా ఉన్నా ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ గుంటూరు కారమే అవుతుందన్న నిర్మాతల నమ్మకానికి తగ్గట్టు బిజినెస్ ఆఫర్లు క్రేజీగా వస్తున్నాయి. థియేటర్ ఒప్పందాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్క్రీన్లు వీలైనన్ని ఎక్కువ దొరక్కపోతే జనాలను కంట్రోల్ చేయడమా కష్టమని బయ్యర్లు భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన నాలుగు సినిమాలు వాటి స్థాయికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకుంటున్నప్పటికీ మహేష్ మాస్ ని కాచుకోవడం అనుకున్నంత ఈజీ కాదని వినిపిస్తోంది. తమన్ నుంచి ఇంకో రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. అవి మాస్ నెంబర్సే కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు.
This post was last modified on December 26, 2023 7:06 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…