సలార్ టీజర్ వచ్చినప్పుడు అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేకపోయినా టినూ ఆనంద్ తో చెప్పించిన డైనోసర్ డైలాగు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా ఒక్క రాకాసి బల్లి ఉండగా అవన్నీ బలాదూర్ అనే రేంజ్ లో జనాలకా మాట బాగా కనెక్ట్ అయిపోయింది. తీరా థియేటర్ లో ఆ సీన్ ఎప్పుడు వస్తుందాని ఎదురు చూస్తే ఇంతకీ రాకపోవడం ఫ్యాన్స్ నే కాదు సగటు ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఎవరి దాకో ఎందుకు సాక్ష్యాత్తు రాజమౌళి కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే థియేటర్ కు వెళ్తానని వీడియో ఇంటర్వ్యూలో చెప్పడం ప్రత్యక్షంగా చూశాం.
కట్ చేస్తే దానికి కారణమేంటో అంతర్గతంగా తెలుస్తోంది. అది ఎడిటింగ్ లో పోలేదట. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో దేవా తండ్రిగా వచ్చే అసలు ప్రభాస్ ఎంట్రీకి దాన్ని వాడుకుంటారట. ఈశ్వరిరావుని భర్తను చూపించకుండా తెలివిగా మేనేజ్ చేసిన ప్రశాంత్ నీల్ ఎండ్ టైటిల్స్ లో ఒక రాతి విగ్రహం లుక్ లో కోరమీసాలతో ప్రభాస్ ని చూపించి చూపించకుండా రివీల్ చేశాడు. అదే తర్వాత భాగంలో మనం చూడబోయే అసలు విశ్వరూపం. ఇవాళ వచ్చిన మూడో లిరికల్ వీడియోని నిశితంగా గమనిస్తే ఇది అర్థమైపోతుంది. సో డైనోసర్ ఎందుకు లేడో క్లారిటీ వచ్చేసిందిగా.
కాకపోతే సలార్ 2 కోసం కాస్త ఎక్కువ వెయిటింగ్ చేయక తప్పేలా లేదు. ఎందుకంటే చాలా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ప్రభాస్ ముందు కల్కి ఆ తర్వాత మారుతీ సినిమా పూర్తి చేయాలి. సందీప్ వంగా స్పిరిట్ మొదలుపెట్టేలోగా సలార్ 2కి శ్రీకారం చుట్టకపోవచ్చు. బాహుబలి లాగా సీక్వెల్ కోసం కనీసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. అప్డేట్ ఇవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. సలార్ ఫైనల్ రన్ అయ్యాకే దీని గురించి ప్రకటన ఇస్తారు. ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకుంటే తప్ప కన్ఫర్మ్ గా ఎప్పుడనేది చెప్పలేమని సలార్ కు పని చేస్తున్న యూనిట్ సభ్యుల మాట. వెయిట్ చేయాలి మరి.
This post was last modified on December 26, 2023 9:50 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…