ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోయినా, ట్రైలర్లు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, కేవలం రెండు పాటలకే ఆడియోని పరిమితం చేసినా సలార్ మాత్రం ఓపెనింగ్స్ తో అదరగొట్టేసింది. శుక్రవారంతో మొదలుపెట్టి సోమవారం క్రిస్మస్ సెలవుదాకా నాన్ స్టాప్ వసూళ్ల సునామీతో బాక్సాఫీస్ ని మోతెక్కించింది. కేవలం మూడు రోజులకే నాలుగు వందల రెండు కోట్లతో షాక్ ఇచ్చిన సలార్ నిన్న ఎంతలేదన్నా ఇంకో వంద కోట్లు నమోదు చేసి ఉంటుందని ట్రేడ్ టాక్. అఫీషియల్ నెంబర్ల విశ్వసనీయత మీద సోషల్ మీడియా డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి కానీ బ్లాక్ బస్టర్ వైపైతే వెళ్తోంది.
ఇక్కడిదాకా అంతా హ్యాపీనే కానీ అసలు పరీక్ష ఇవాళ మొదలుకానుంది. సెలవులు అయిపోయాయి. తెలంగాణలో భారీగా ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు రెండో వారం నుంచి సాధారణ స్థితికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన నలభై రూపాయల పెంపు జనవరి 1 దాకా అమలులో ఉంటుంది. పాజిటివ్ టాక్ వచ్చిన ఊపులో మొదటి నాలుగు రోజులు దీని ప్రభావం పెద్దగా కనిపించలేదు కానీ వర్కింగ్ డే మొదలైపోయింది కాబట్టి ఇకపై వచ్చే లెక్కలు సలార్ అసలు సత్తాని చాటబోతున్నాయి. డ్రాప్ ఉండటం సహజమే కానీ అది మరీ తీవ్రంగా ఉండకపోతేనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం సులభమవుతుంది.
సుమారు ఎనిమిది వందల కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో బరిలో దిగిన సలార్ కు తమిళ, హిందీ, మలయాళం వెర్షన్ల నుంచి యునానిమస్ మద్దతు దక్కకపోవడం ఫ్యాన్స్ కి నిరాశ కలిగించింది. ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాల్లో డంకీ ఆధిపత్యం చెలాయించడం ఇబ్బంది పెట్టింది. ఒకవేళ సలార్ కనక శనివారం దాకా స్టడీగా ఉన్నా మళ్ళీ ఇంకో వీకెండ్ కలిసి వస్తుంది. డెవిల్, బబుల్ గమ్ లాంటి కొత్త రిలీజుల ఎఫెక్ట్ మరీ తీవ్రంగా ఉండకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకా సగం దూరమే ప్రయాణించిన సలార్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సంక్రాంతి వచ్చేలోపు అన్నీ దాటేయాలి.
This post was last modified on December 26, 2023 3:57 pm
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్‌కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…