టాలీవుడ్ రీ రిలీజులు జనాలకు బోర్ కొట్టేసిన టైంలో వెంకీని మళ్ళీ విడుదల చేయడం పట్ల అనుమానాలు తలెత్తాయి కానీ తీరా ట్రెండ్ చూస్తుంటే దానికి భిన్నంగా కనిపిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి ఇరవై నాలుగు గంటల లోపే 6 వేల 300 టికెట్లు అమ్ముడుపోవడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇది బుక్ మై షో యాప్ లో అధికారికంగా చూపిస్తున్న నెంబరే. అలా అని తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో అమ్మకాలు జరగడం లేదు. కేవలం హైదరాబాద్ క్రాస్ రోడ్స్ నుంచే ఇంత పెద్ద ఫిగర్ నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో వెంకీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా గంటకు పైగా సాగే సుధీర్ఘమైన ట్రైన్ ఎపిసోడ్ థియేటర్లలో ఓ రేంజ్ లో పేలింది. బ్రహ్మానందం, ఏవీఎస్, మాస్టర్ భరత్ ల పాటు హీరో ఫ్రెండ్స్ బృందం చేసే కామెడీ మాములుగా నవ్వించలేదు. ఇప్పటికీ ఎన్నో మీమ్స్ వీటిని ఆధారంగా చేసుకునే వస్తుంటాయి. బ్రహ్మీ ఎక్స్ ప్రెషన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు శ్రీను వైట్ల రేంజ్ పెరగడంలోనూ ఇది దోహదపడింది. హీరోయిన్ స్నేహ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అశుతోష్ రానా విలనీ, చక్కని హాస్యం ఇలా ఎన్నో అంశాలు విజయానికి దోహదపడింది.
ఈ నెల 30న వెంకీని రిలీజ్ చేస్తుండగా మరుసటి రోజు 31న రజనీకాంత్ శివాజీ రాబోతోంది. దీనికి వెంకీ స్పందనలో సగం కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. అయినా సలార్ తాకిడి ఒకవైపు, 29న డెవిల్-బబుల్ గమ్ లాంటి కొత్త రిలీజుల ప్రవాహం మరోవైపు పెట్టుకుని కూడా వెంకీ ఈ మాత్రం టికెట్లు అమ్మడం విశేషమే. రవితేజ గత రీ రిలీజ్ మిరపకాయ్ ఆశించిన ఫలితం అందుకోలేదు. విక్రమార్కుడుని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఎందుకనో నిర్మాతలు చొరవ తీసుకోవడం లేదు. రికార్డులు కాదు కానీ వెంకీ డీసెంట్ గా ఆడితే చాలు అదే పది వేలంటున్నారు అభిమానులు.
This post was last modified on December 25, 2023 8:37 pm
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…