నిన్న విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తాను ఎవరిని ఉద్దేశించి తీయలేదని చెబుతూ వచ్చిన వర్మ ఇది పూర్తిగా జగన్ సర్కార్ కి ప్రయోజనం కలిగించేలా, చంద్రబాబు-లోకేష్-పవన్ లను పర్సనల్ గా టార్గెట్ చేసేలా ఉందని ట్రైలర్, పోస్టర్లు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. నిన్న ఏపీ అధికార పార్తీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కావడం చూస్తే చెప్పొచ్చు ఎజెండా ఏమై ఉంటుందో. మినిస్టర్ రోజా తన ప్రసంగంలో భాగంగా వర్మ మీద పొగడ్తల వర్షం కురిపించారు. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ అంటూ బాలీవుడ్ దాకా ఎదిగిన వైనాన్ని ప్రశంసల రూపంలో గుప్పించారు.
ఆవిడ చెప్పిన మాటలు ఒక పది పదిహేనేళ్ల క్రితం వరకు అందరూ ఒప్పుకునేవే. శివ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీతో టాలీవుడ్ వేగాన్ని మార్చింది ఈయనే. రంగీలా, సత్య, సర్కార్ లతో తెలుగువాడి సత్తాని ముంబైలో చాటింది కూడా వర్మనే. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, తేజ లాంటి ఎన్నో యంగ్ టాలెంట్స్ అయన శిష్యరికం నుంచి వచ్చినవే. కానీ చాలా కాలంగా వర్మ తమ ముద్రను కోల్పోయి కేవలం బ్రాండ్ ని క్యాష్ చేసుకోవడం కోసం వివాదాలను ఎంచుకుని దాని మీద సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసిపితో చేతులు కలిపినప్పటి నుంచి ఇది మరీ ఎక్కువయ్యింది.
ఇప్పుడీ వ్యూహం కూడా అందులో భాగంగా వచ్చిందే. ఈవెంట్ కి జనం పెద్దగా రాలేదు. స్టార్ అట్రాక్షన్ లేకపోవడంతో స్వచ్చందంగా తరలి వచ్చిన వాళ్ళు లేరు. ఉన్నంతలో మంత్రుల అనుచరగణాల హంగామానే ఎక్కువగా కనిపించింది. 29 విడుదల కాబోతున్న వ్యూహంకు ఇంకా రూట్ క్లియర్ కాలేదు. 27న కోర్టు వాయిదా ఉంది. ఆ రోజు కనక తీర్పు ప్రతికూలంగా వస్తే రిలీజ్ కు బ్రేకులు పడతాయి. లేదూ సానుకూలంగా వస్తే మాత్రం థియేటర్లలో అడుగు పెడుతుంది. కళ్యాణ్ రామ్ డెవిల్, బబుల్ గమ్ పోటీ ఉంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం వ్యూహంకు పెద్ద సవాలే
This post was last modified on December 24, 2023 12:05 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…