కొత్త హీరో ఎవరైనా లాంచ్ అయ్యే సమయంలో డెబ్యూ రిలీజ్ డేట్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ ప్రేక్షకులకు చేరుకోవాలంటే ప్రమోషన్లతో పాటు రిలీజ్ టైమింగ్ చాలా ముఖ్యం. యాంకర్ సుమ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న బబుల్ గమ్ ఈ నెల 29న విడుదల కాబోతోంది. పబ్లిసిటీ గట్రా బాగానే చేస్తున్నారు. ట్రైలర్ కట్ యూత్ కి నచ్చేలా చూసుకున్నారు . కృష్ణ అండ్ హిజ్ లీలని బాగా డీల్ చేసిన రవికాంత్ పేరేపు మరోసారి టీనేజ్ ఎలిమెంట్స్ టచ్ చేసిన తీరు అంచనాలైతే రేపగలిగింది. ఇక్కడి దాకా ఓకే.
అసలే సలార్ వచ్చిన వారానికే బబుల్ గమ్ రిలీజ్. టాక్ సంగతి ఎలా ఉన్నా కనీసం రెండు వారాల పాటు ప్రభాస్ సినిమాకు సాలిడ్ రన్ ఉంటుందని బయ్యర్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. అగ్రిమెంట్లు కూడా దానికి తగ్గట్టే జరిగాయి. ఓపెనింగ్స్ తాకిడి, అధిక టికెట్ రేట్లు చూసి సెకండ్ వీక్ లో చూద్దామని ఆగిపోయిన ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో ఇది మొదటి ముప్పు. మరొకటి అదే 29న కళ్యాణ్ రామ్ డెవిల్ ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లానింగ్ జరిగిపోయింది. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కావడం వల్ల దర్శకుడు కం నిర్మాత అభిషేక్ నామాకు థియేటర్ల సమస్య లేకుండా గ్రౌండ్ రెడీ అయిపోయింది.
సో బబుల్ గమ్ ఈ రెండు ఒత్తిళ్ల మధ్య తట్టుకోవాల్సి ఉంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండగా ఉండటం ప్లస్సే కానీ ఆ బ్రాండ్ జనాలను థియేటర్లకు రప్పించడానికి సరిపోదు. కాకపోతే వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా కాదు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. ఏది ఎలా ఉన్నా బబుల్ గమ్ చేతిలో రెండు వారాలు మాత్రమే టైం ఉంటుంది. సంక్రాంతి హడావిడి జనవరి 12 నుంచి మొదలవుతుంది కాబట్టి ఆలోగానే మొత్తం రాబట్టుకోవాలి. శ్రీకాంత్ కొడుకు రోషన్ మెల్లగా కుదురుకుంటున్న టైంలో ఇప్పుడీ కొత్త రోషన్ ఎలాంటి ఎంట్రీ అందుకుంటాడో వచ్చే వారం తేలిపోతుంది.
This post was last modified on December 23, 2023 11:17 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…