Movie News

సలార్-2.. వేరే లెవెల్

మొత్తానికి ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ వాళ్ళ కోరుకున్న విధంగా కనిపించాడు సలాడ్ సినిమాలో. ప్రభాస్ కటౌట్ ఇమేజ్ కు తగ్గట్టుగా సలార్ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కథపరంగా పూర్తి సంతృప్తిని ఇవ్వకపోయినా.. ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా పండడంతో అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సగటు ప్రేక్షకులకు సినిమా పైసా వసూల్ అనిపిస్తోంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయిపోయినట్లే.

కానీ సలార్ సినిమా విషయంలో అనేక అభ్యంతరాలు, సందేహాలు ఉన్నమాట వాస్తవం. హీరో క్యారెక్టర్ గ్రాఫ్ సరిగా లేదని.. ఇద్దరు మిత్రుల మధ్య స్నేహం, వైరం సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని.. కథను గందరగోళంగా నడిపించారని.. చాలా విషయాలు కన్ఫ్యూజన్లో పెట్టేశారని.. ఇలా రకరకాల కంప్లైంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.

అయితే ఈ అసంతృప్తికి, ప్రశ్నలకు సలార్ సెకండ్ పార్ట్ సమాధానంగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సలార్ పార్ట్-1లో హీరో పాత్ర తాలూకు అన్ని కోణాలను పూర్తిస్థాయిలో చూపించలేదు ప్రశాంత్ నీల్. అతను దాచిపెట్టిన, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది. అలాగే పృథ్విరాజ్ తో ప్రభాస్ వైరం గురించి కూడా ఊరికే అలా మాటల్లో చెప్పారు తప్ప తెరపై చూపించింది పెద్దగా లేదు. ప్రాణ స్నేహితులు ఎందుకు బద్ధ శత్రువులుగా మారారు.. అలా అయ్యాక వారి మధ్య పోరాటం ఎలా సాగింది అన్నది ఆసక్తి ఎక్కించి ఇచ్చే విషయం.

ఇక ఫస్ట్ పార్ట్ లో పై పైన కనిపించిన జగపతిబాబు పాత్ర కూడా రెండో భాగంలో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. రెండో భాగానికి సౌర్యంగన పర్వం అంటూ ఆసక్తికర టైటిల్ పెట్టడమే కాక.. ప్రభాస్ పాత్రకు సంబంధించి కొత్త కోణాన్ని అందులో ఆవిష్కరించడానికి, కథ మొత్తం అతడి చుట్టూనే నడపడానికి ఒక బేస్ సిద్ధం చేశాడు. కాబట్టి సలార్ ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా బెటర్ గా గ్రిప్పింగ్ గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రేక్షకులు దానిమీద ఎక్కువ అంచనాలే పెట్టుకోవచ్చు.

This post was last modified on December 22, 2023 9:41 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

3 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

4 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

4 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago