బాహుబలి సక్సెస్ అయిన దగ్గర నుంచి సౌత్ సినిమాల పట్ల బాలీవుడ్ జనాల్లో ఒక రకమైన అసూయ మొదలైంది. ఉత్తరాది ప్రేక్షకులు హిందీ చిత్రాలను పక్కనపెట్టి దక్షిణాది సినిమాలకు పట్టంకట్టడంతో ఆ అసూయ పెరుగుతూ పోయింది. దీంతో నెమ్మదిగా సౌత్ సినిమాల పట్ల అక్కసు వెళ్ళగక్కడం మొదలుపెట్టారు బాలీవుడ్ క్రిటిక్స్. ముఖ్యంగా ఈ క్రిస్మస్ కు డంకీకి పోటీకి సై అన్న సలార్ విషయంలో బాలీవుడ్ ఎలా స్పందించిందో అందరికీ తెలుసు.
మీడియా దగ్గర నుంచి ట్రేడ్ వర్గాలు, ఎగ్జిబిటర్స్ వరకు అందరూ ఈ సినిమా మీద శీతకన్ను వేశారు. మీడియాలో నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. థియేటర్ షేరింగ్ విషయంలో అన్యాయం జరిగింది. ఇంకా అనేక రకాలుగా సలార్ ను తొక్కే ప్రయత్నం జరగడం స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో డంకీ సినిమాకు ఎక్కడలేని ఎలివేషన్ ఇచ్చారు. ఆ సినిమాకు ఉత్తరాదిన రిలీజ్ పరంగా అంతా అనుకూలంగా సాగింది.
అయితే తెర వెనుక ప్రయత్నాలు ఎన్ని జరిగినా సినిమా ఫలితాన్ని నిర్దేశించేది ప్రేక్షకులే అన్నది స్పష్టం. వాళ్ల తీర్పు మాత్రం సలార్ కు పూర్తి అనుకూలంగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రేక్షకులు సలార్ కోసమే ఎగబడ్డారు. రిలీజ్ తర్వాత కూడా సలార్ స్పష్టమైన పైచేయి సాధిస్తోంది. డంకీకి రివ్యూలు, టాక్ అనుకూలంగా రాలేదు. ఆ ప్రభావం ఆల్రెడీ తొలి రోజు వసూళ్ల మీద పడింది. సలార్ సినిమా కూడా టాక్ అంత గొప్పగా లేకపోయినా.. అది సినిమా మీద చూపించే ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. మాస్ సినిమాలకు పైసా వసూల్ అనిపిస్తే చాలు అవి బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయిపోతాయి. ఓపెనింగ్స్ విషయంలో ప్రకంపనలు రేపేలా కనిపిస్తున్న సలార్.. డంకిని తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on December 22, 2023 9:03 pm
ప్రధాని మోడీని చూశారో.. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని చూశారో తెలియదు కానీ.. కార్పొరేట్ దిగ్గజాలు.. బీజేపీపై విరాళాల…
అమెరికాలోని శాస్త్రవేత్తలు చరిత్రలో ఒక విప్లవాత్మక అధ్యాయాన్ని తిరిగి రాశారు. ఐస్ ఏజ్లో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అడవుల్లో…
మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ప్రమోషన్ల విషయంలో మౌనం పాటిస్తూ వచ్చిన విశ్వంభర ఎట్టకేలకు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. సింగపూర్ లో…
ఐపీఎల్ 2025: ముంబయి ఇండియన్స్తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన తరువాత విరాట్ కోహ్లీ వైల్డ్…
ఓ ప్రజా ప్రతినిధి అన్నాక ఎలా ఉండాలి? అది కూడా ఓ శాసన సభ్యుడిగా కొనసాగుతున్న నేత ఎంత జాగ్రత్తగా…