సరిగ్గా ఇంకో ఇరవై రోజుల్లో గుంటూరు కారం విడుదల. జనవరి 12 అట్టే దూరంలో లేదు. షూటింగ్ విపరీతమైన ఒత్తిడి మధ్య ఆఘమేఘాల మీద జరుగుతోంది. శ్రీలీల తన ఎంబిబిఎస్ పరీక్షలు వదులుకుని మరీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఒకవేళ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే వారం గ్యాప్ తీసుకోవాలి. అదే జరిగితే విడుదల వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకే సప్లిమెంటరీ రాసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకొక్క పాట బాలన్స్ షూట్ జరుపుతున్నారు. ఈలోగా మహేష్ కు పాటలు నచ్చడం లేదని, మళ్ళీ చేసుకుని రమ్మని చెబుతున్నారని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అవి నిజమైనా కాకపోయినా చేతిలో ఉన్న అతి తక్కువ టైంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం అంత సులభం కాదు. ట్రైలర్ వదలాలి. లిరికల్ వీడియోలు సిద్ధం చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలనేది నిర్ణయించాలి. ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలనేది చూసుకోవాలి. చివరి అయిదారు రోజులు ఫైనల్ రీ రికార్డింగ్, సెన్సార్ ఫార్మాలిటీ, ఓవర్సీస్ లకు హార్డ్ డిస్క్ డిస్ప్యాచ్ లాంటి బోలెడు తతంగాలు ఉంటాయి. అంటే నికరంగా చేతిలో ఉన్నది రెండు వారాలే అనుకోవాలి. మాములుగా న్యూ ఇయర్ విదేశాల ట్రిప్ ప్లాన్ చేసుకునే మహేష్ ఇప్పుడు వెళ్తాడో లేదో తెలియదు.
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ ప్రాపర్ టీజర్, ట్రైలర్లు వదిలేశాయి. పాటలు కూడా తిరుగుతున్నాయి. గుంటూరు కారంకు సంబంధించి మాత్రం ఓ మై బేబీ మీద జరిగిన నెగటివ్ ప్రాపగండానే పెద్ద పీఠ తీసుకుంది. ఆరు నూరైనా సరే జనవరి 12 విడుదల చేయాల్సిన ప్రెజర్ ని తట్టుకోవడం మాటల్లో అనుకున్నంత తేలిక కాదు. ఏ మాత్రం మార్చాలని చూసినా స్వంత ఫ్యాన్స్ నుంచే తీవ్ర నిరశన వ్యక్తమవుతుంది. ఇంత హడవిడిలోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇవ్వబోయే క్వాలిటీ గురించి అనుమాన పడొద్దని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. బిజినెస్ మాత్రం యమా క్రేజీగా జరిగిపోయింది.
This post was last modified on December 22, 2023 3:21 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…