Movie News

నాగచైతన్యను భిన్నంగా నిలిపేది అదే..

టాప్ స్టార్ల వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ల మీద భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడానికి, స్టార్ ఇమేజ్ పెంచుకోవడానికి వారసత్వ హీరోలు ఎక్కువగా మాస్ సినిమాలు చేయడం, ఎలివేషన్ల కోసం ప్రయత్నించడం చూస్తుంటారు. ప్రతిదీ అభిమానులను దృష్టిలో ఉంచుకునే చేస్తుంటారు. కానీ అక్కినేని కుర్రాడు నాగచైతన్య మాత్రం ఇందుకు భిన్నం.

అతను ఎప్పుడూ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోలేదు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు, క్లాస్ మూవీస్‌తోనే హిట్లు కొట్టాడు. మాస్ సినిమాలు అప్పుడప్పుడూ ట్రై చేసినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ అతను ఆ ఇమేజ్ కోసం వెంపర్లాడలేదు. తన సినిమాల్లో కూడా ఎలివేషన్లు, ఫైట్లు, డ్యాన్సులు అని లెక్కలేసుకుని ఫార్ములా సినిమాలు చేయలేదు. బయట కూడా అతను పెద్దగా బిల్డప్‌లు ఇవ్వడు. ఎంతో అణకువతో వ్యవహరిస్తుంటాడు.

తన సినిమాల్లో కథను బట్టి వెళ్లిపోతాడే తప్ప.. ఇమేజ్ లెక్కలు వేసుకోడని పలుమార్లు రుజువైంది. తాజాగా తన నుంచి రాబోతున్న ‘వృషకర్మ’ విషయంలో చైతూ ఇంకా బోల్డ్ స్టెప్ వేస్తున్నాడని అర్థమవుతోంది.

గురువారం రిలీజైన ‘వృషకర్మ’ టీజర్లో.. నాగచైతన్య పాత్రను బాగా అండర్ ప్లే చేశారు. టీజర్లో కాన్సెప్ట్‌ను, విలన్‌ను హైలైట్ చేయడానికే చూశారు. టీజర్ మొదలైంది విలన్ పాత్ర మీదే. సగం వరకు అతనే హైలైట్ అయ్యాడు. తర్వాత చైతూ రంగంలోకి దిగాడు. అప్పుడు కూడా చైతూకు, తన పాత్రకు మరీ బిల్డప్ ఏమీ ఇవ్వలేదు.

మొత్తంగా టీజర్లో కాన్సెప్ట్, విలన్ క్యారెక్టర్, విజువల్స్, కథా నేపథ్యాన్ని చూపించే వరల్డ్ హైలైట్ అయ్యాయి తప్ప.. చైతూ మీదికి ఎక్కువ ఫోకస్ వెళ్లలేదు. ఇదే విషయమై చైతూను అడిగితే.. తాను దర్శకుడు కార్తీక్ దండు విజన్‌ను నమ్మి అందుకు తగ్గట్లుగా ముందుకు వెళ్లిపోయానని.. తాను హైలైట్ కావాలని అనుకోలేదని చెప్పాడు.

అలా లెక్కలేసుకుని చేసిన సినిమాల విషయయంలో కొన్నిసార్లే విజయవంతం అయ్యారని.. చాలాసార్లు ప్రతికూల ఫలితాలే వచ్చాయని.. కాబట్టి కథకు ఏది అవసరమో అది చేయడమే తనకు ముఖ్యం అని.. అందుకే తన గురించి ఆలోచించలేదని చెప్పాడు. చైతూ మిగతా హీరోలకు భిన్నం అనడానికి ఇది ఉదాహరణ. ఈ విషయంలో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

This post was last modified on March 5, 2026 10:31 pm

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

41 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

2 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

3 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

3 hours ago