ఏ హీరోయిన్ కైనా షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. బాలీవుడ్ లో పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తాప్సీ పన్నుకి గత ఏడాది డంకీలో ఆఫర్ వచ్చినప్పుడు మేఘాల్లో తేలిపోయింది. ఎందుకంటే కల్ట్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, కింగ్ ఖాన్ కాంబినేషన్ లో మొదటి మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. పైగా నటనను పిండుకోవడంలో సదరు డైరెక్టర్ కున్న పేరు అందరికీ తెలిసిందే. కానీ డంకీ ఫలితం చూస్తుంటే బోల్తా కొట్టినట్టు స్పష్టమవుతోంది.
డంకీ రివ్యూలు, ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేవు. మొదటి రోజు కనీసం యాభై కోట్ల గ్రాస్ ని ఆశిస్తే అతి కష్టం మీద ముప్పై కోట్ల మార్కుని దాటడం ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ఇక్కడ తాప్సీ పరంగా చూసుకుంటే మన్ను రన్దావా పాత్రని చాలా చక్కగా పోషించింది. ముసలి గెటప్ లో మేకప్ తేడా కొట్టింది కానీ యాక్టింగ్ విషయంలో షారుఖ్ కు ధీటుగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. కొన్ని ఫ్రేమ్స్ లో డామినేట్ కూడా చేసింది. నిజానికి తనని రాంగ్ ఛాయసని మొదట్లో అనుకున్నారు. కానీ తెరమీద చూశాక అభిప్రాయాలు మారిపోయాయి. ఇంత కష్టపడినా వృధా అయిపోయింది.
రాజ్ కుమార్ హిరానీ ఫిల్మోగ్రఫీలో వీక్ కంటెంట్ ఉన్న సినిమాగా డంకీ నిలుస్తోంది. ఇక్కడ సౌత్ ఆడియన్స్ నయం. ఉత్తరాది పబ్లిక్ నిర్మొహమాటంగా సినిమా బాలేదని మీడియా మైకుల ముందు చెప్పేస్తున్నారు. అంచనాలు ఎక్కువైపోవడంతో నిరాశ కూడా దానికి తగ్గట్టే పెరిగింది. జవాన్, పఠాన్ ల సరసన మరో వెయ్యి కోట్ల హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పడుతుందని ఆశించిన బాలీవుడ్ ట్రేడ్ కి కనీసం అందులో సగం వచ్చినా గొప్పే అనుకోవాలి. అంతో ఇంతో మాస్ కి రీచ్ అయ్యే కంటెంట్ ఉన్న టైగర్ 3నే ఆ మైలురాయి అందుకోలేదు. అలాంటిది డంకీ వల్ల ఇది జరిగే పనేనా.
This post was last modified on December 22, 2023 12:07 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…