ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ అన్నదగ్గ సలార్ విడుదలకు ఇంకొన్ని గంటల సమయమే ఉంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడం.. కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. రిలీజ్ కాకముందే ఈ సినిమా రికార్డుల వేటను మొదలు పెట్టింది.
యూఎస్ ప్రీమియర్ సేల్స్ ద్వారా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సలార్ రికార్డు బద్దలు కొట్టింది. విడుదలకు సగం రోజు సమయం ఉండగానే ఈ చిత్రం అమెరికాలో 1.7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 70 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
ఈ ఏడాది మరే సినిమా కూడా అక్కడ ప్రి సేల్స్ ద్వారా ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. విడుదలకు ముందే ఏ చిత్రానికి ఇన్ని టికెట్లు అమ్ముడవ్వలేదు. షారుక్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమాలు పఠాన్, జవాన్ లతో పాటు.. సలార్ కి పోటీగా రిలీజ్ అవుతున్న ఆయన కొత్త చిత్రం డంకి కూడా ప్రి సేల్స్ ద్వారా ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. ప్రిమియర్స్ పూర్తయ్యేసరికి సలార్ 2.5 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రాబడుతుందని అంచనా. పాజిటివ్ టాక్ రావాలే కానీ సలార్ అలవోకగా అమెరికాలో 10 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
ఇక ఇండియాలో అయితే సలార్ క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు, తొలి వీకెండ్ రికార్డులన్నీ బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. సౌత్ ఇండియా అంతటా సలార్ మేనియా కనిపిస్తోంది. ఉత్తరాదిన సైతం డంకికి ప్రభాస్ సినిమా గట్టి పోటీ ఇస్తోంది. టాక్ బాగుంటే బాహుబలి తర్వాత మళ్లీ ప్రభాస్ ఓ భారీ విజయం అందుకోబోతున్నట్లే.
This post was last modified on December 21, 2023 3:49 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…