Movie News

ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఇచ్చారు

ఒక సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. సందీప్ కిషన్- విఐ ఆనంద్ కలయికలో మొదలైన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా మీద కూడా ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన తొలి పాట “నిజ‌మే నే చెబుతున్నా” పాట సంగీత ప్రియులను విపరీతంగా కట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాట వల్ల సినిమాకు మంచి బజ్ కూడా వచ్చింది.

సందీప్ కిష‌న్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కానీ ఎంత‌కీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఇవ్వ‌లేదు. సందీప్ కిష‌న్ కెరీర్‌కు కీల‌క‌మైన ఈ సినిమా గురించి ఏ స‌మాచారం లేక‌పోవ‌డంపై త‌న అభిమానుల్లో నిరాశ వ్య‌క్త‌మైంది. అయితే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం.

వచ్చే ఏడాది వాలెంటెన్స్ డే వీకెండ్ కు ముందుగా ఊరు పేరు భైరవకోనను రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని సందీప్ కిషన్ ట్విట్టర్ లో ప్రకటించాడు. మూడేళ్ల కష్టం, ఎన్నో ఏళ్ల కల ఆ రోజు నెరవేరుతుందంటూ సందీప్ కిషన్ ఎమోషనల్ గా సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు.

గత ఏడాది వ్యవధిలో కాంతార, విరూపాక్ష, మా ఊరి పొలిమేర-2 లాంటి మిస్టరీ థ్రిల్లర్లు మంచి విజయం సాధించిన నేపథ్యంలో అదే జానర్లో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే విరూపాక్ష మూవీతో పోలికులుండ‌టం వ‌ల్లే స్క్రిప్టులో మార్పులు చేసి రీషూట్లు చేస్తున్నార‌ని, అందుకే రిలీజ్ ఆలస్యం అవుతోందని ఇటీవల రూమ‌ర్లు వినిపించాయి. దీంతో చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు స్పందించారు. విరూపాక్ష‌తో త‌మ సినిమాకు పోలికేమీ లేద‌ని వీఐ ఆనంద్ స్పష్టం చేశాడు. జాన‌ర్ ఒక్క‌టైనంత మాత్రాన క‌థ‌లు ఒక‌లా ఉండ‌వ‌ని అత‌న‌న్నాడు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఆల‌స్యం వ‌ల్లే సినిమా రిలీజ్ లేట‌వుతోంద‌ని ఆనంద్ తెలిపాడు. కొన్నేళ్ల కిందట ఎక్కడికి పోతావు చిన్నవాడాతో బ్లాక్ బస్టర్ మళ్లీ అలాంటి సినిమాను డెలివర్ చేస్తాడని సందీప్ కిషన్ అభిమానులు ఆశిస్తున్నారు.

This post was last modified on December 21, 2023 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

43 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago