Movie News

ఒక రోజు ముందు రావడం డంకీకి లాభమా నష్టమా

దేశమంతా సినీ ప్రేమికులు సలార్ జపం చేస్తున్న టైంలో డంకీ ఒక రోజు ముందు గురువారమే థియేటర్లలో అడుగు పెడుతోంది. ఇది ఒక కోణంలో కలిగించే పెద్ద లాభమేంటంటే ఎవరితోనూ స్క్రీన్లు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సోలో రన్ ఎంజాయ్ చేయడం. హాలీవుడ్ మూవీ అక్వమెన్ ది ఫాలెన్ కింగ్ డమ్ ఉన్నప్పటికీ అదేమీ స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ రేంజ్ లో హైప్ ఉన్న మూవీ కాదు. సో ఉత్తరాది రాష్ట్రాల్లో డంకీకి భారీ ప్రయోజనం కలగనుంది. ఒకవేళ శుక్రవారాన్ని ఎంచుకుని ఉంటే సలార్ ధాటికి ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాలా సమస్యలు వచ్చేవి.

ఇక నష్టం సంగతికొస్తే డంకీ టాక్ పాజిటివ్ గా వస్తే ఓకే. లేదంటే ప్రేక్షకుల దృష్టి పూర్తిగా సలార్ వైపు వెళ్ళిపోతుంది. ప్రభాస్ మూవీలో ఉన్నంత ఊర మాస్ కనీసం ఓ పావు వంతు కూడా షారుఖ్ సినిమాలో ఉండదు. రెండు సంబంధం లేని వేర్వేరు జనార్లే అయినప్పటికీ కంటెంట్ పరంగా పోలికలు వస్తాయి కాబట్టి మెజారిటి ప్రేక్షకుల మద్దతు ఆటోమేటిక్ గా సలార్ వైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో షోలు, థియేటర్ల లెక్కలు మారిపోయి సోమవారం నుంచి అదంతా డంకీకి ప్రతికూలంగా మారుతుంది.

పోటీ ఎలా ఉన్నా ఫలితం పట్ల ఇద్దరి దర్శక నిర్మాతలు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా వరస ఫ్లాపుల తర్వాత కూడా దాని ప్రభావం సలార్ మీద ఇనుమంత ప్రభావం లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. రాజమౌళి చేసిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పినట్టు స్టార్ ఎప్పటికైనా స్టారే. రెండు కాదు ఇంకో ఇరవై ఫ్లాపులు వచ్చినా కూడా సరైన బ్లాక్ బస్టర్ వస్తే అతని సత్తా మళ్ళీ బయట పడుతుంది. పఠాన్, జవాన్ లను ఉదాహరణగా చూపారు. సో సలార్ కూడా ఆ రేంజ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం డంకీకి బాక్సాఫీస్ కష్టాలు తప్పవు.

This post was last modified on December 20, 2023 1:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప రాజు ఏదో సంకేతం ఇస్తున్నాడు…

ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…

8 minutes ago

కాశిలో తండేల్ పాట…ఎన్నో ప్రశ్నలకు సమాధానం!

నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…

2 hours ago

రేవతి కుమారుడు కోలుకోడానికి మేము ఏమైనా చేస్తాం : అల్లు అరవింద్!

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…

2 hours ago

ఎమ్మెల్యేలకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష…

2 hours ago

అట్లీ ఇవ్వబోయే షాకేంటి?

పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సౌత్ దర్శకుల్లో అట్లీ ఒకడు. రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి…

2 hours ago