Movie News

సుహాస్ నేరుగా బూరెల బుట్టలోకే

ఏ ముహూర్తంలో కలర్ ఫోటో ఒప్పుకున్నాడో కానీ జాతీయ అవార్డు సాధించిన ఆ సినిమా హీరో సుహాస్ జాతకాన్ని మార్చేసింది. తక్కువ బడ్జెట్ తో కొత్త దర్శకులకు చాలా కంఫర్ట్ గా అనిపించే ఇతనితో చేయడానికి ఔత్సాహికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం తను అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ విడుదల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ అంచనాలు రేపినప్పటికీ సరైన రిలీజ్ స్లాట్ దొరక్క నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు. కంటెంట్ మీద మంచి బజ్ ఉండటంతో వీలైనంత సోలోగా రావడానికి చూస్తున్నారు కానీ కొంచెం టైం పట్టేలా ఉంది.

దీని సంగతి కాసేపు పక్కన పెడితే సుహాస్ తంతే బూరెల బుట్టలో పడ్డట్టు భలే ఆఫర్లు పడుతున్నాడు. చాయ్ బిస్కెట్ టీమ్ తో రైటర్ పద్మభూషణ్ చేయడం ఎంత ప్లస్సయ్యిందో చూశాం. తాజాగా దిల్ రాజు కాంపౌండ్ లోకి వచ్చి చేరాడు. బలగంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హన్షిత రెడ్డి తన తండ్రి పేరు మీద నెలకొల్పిన బ్యానర్ లో సుహాస్ హీరోగా కొత్త సినిమా మొదలైంది. ప్రశాంత్ నీల్ దగ్గర పని చేయడమే కాక సలార్ డైలాగ్స్ రాసిన సందీవ్ రెడ్డి బండ్ల దీనికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బేబీ లాంటి సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ తో వరస ఆఫర్లు పడుతున్న విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇది కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనరని యూనిట్ టాక్. ఆద్యంతం నవ్విస్తూనే భావోద్వేగాలు కలగజేస్తుందని అంటున్నారు. సుహాస్ కేవలం హీరోగానే చేస్తానని పట్టుబట్టడం లేదు. హిట్ 2 ది సెకండ్ కేస్ లో విలన్ గా నటించాడు. ఫ్యామిలీ డ్రామాలో భయపెట్టాడు. మను చరిత్ర, మిషన్ ఇంపాజిబుల్ లో క్యామియోలు చేశాడు. ఇకపై మాత్రం కథానాయకుడిగానే ఎక్కువ కొనసాగేలా కనిపిస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ మరొక్కటి పడితే సుహాస్ పూర్తిగా సెటిలైపోయినట్టే.

This post was last modified on December 19, 2023 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

2 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

3 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

3 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

4 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

4 hours ago