ఎట్టకేలకు ఎదురు చూపులకు బ్రేక్ పడింది. సలార్ కు సంబంధించిన బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి జిఓలు వచ్చేశాయి. కాంగ్రెస్ సర్కారు సింగల్ స్క్రీన్లకు 65 రూపాయలకు, మల్టీప్లెక్సులకు 100 రూపాయలు వారం రోజుల పాటు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చింది. అంటే చాలా బహుళ సముదాయాల్లో ఉన్న గరిష్ట ధర 295 రూపాయలకు ఇంకో వంద అదనంగా చేర్చి ప్లస్ బుకింగ్ చార్జెస్ కలుపుకుంటే నాలుగు వందల ముప్పై దాకా చేరుతుంది. సింగల్ స్క్రీన్లను చూసుకుంటే చాలా మెరుగ్గా రెండు వందల డెబ్భై లోపే అయిపోతుంది.
ఇక ఏపీ విషయానికి వస్తే కేవలం 40 రూపాయలు మాత్రమే పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం బయ్యర్ల కోణంలో కొంత నిరాశ పరిచేదే అయినా ప్రేక్షకులు మాత్రం పక్క రాష్ట్రంతో పోలిస్తే తక్కువ ధరకు చూశామన్న సంతృప్తి మిగులుతుంది. ఇక స్పెషల్ షోలు ముందే చెప్పినట్టు అర్థరాత్రి 1 గంటకు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 20 థియేటర్లలు ఆ స్పెషల్ షో వేసుకోవడానికి లిస్టు ఇచ్చేశారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ నగరాల్లో ప్రీమియర్లు ఉండబోతున్నాయి. అత్యధిక కౌంట్ భాగ్యనగరంలోనే వేస్తున్నారు.
ఆంధ్రలో పది రోజుల పాటు వెసులుబాటు ఇచ్చారు కానీ మిడ్ నైట్ షోలకు సంబంధించి క్లారిటీ లేదు. మాములుగా అయిదు షోలకు రెగ్యులర్ గానే వేసుకోవచ్చు. ఆలా అయితే ఉదయం 7 కన్నా ముందే వేసుకునే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ప్రత్యేక మినహాయింపు ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇక క్రాస్ రోడ్స్, కూకట్ పల్లిలో నేరుగా బుకింగ్ కౌంటర్లలో చేపట్టిన అమ్మకాలకు అనూహ్య స్పందన కనిపిస్తోంది. కిలోమీటర్ పైగానే క్యూ’ లైన్లు బారులు తీరాయి. స్పెషల్, మ్యాట్నీ కాకుండా సాయంత్రం షోలను కొన్ని చోట్ల టికెట్లు ఇస్తున్నారు. కొంత ప్రయాసతో కూడుకున్న వ్యవహారమే అయినా ఫ్యాన్స్ సలార్ మేనియాలో అదేమీ పట్టించుకోవడం లేదు.
This post was last modified on December 19, 2023 7:22 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…