సలార్ మాస్ వర్సెస్ రివ్యూస్

సాధారణంగా క్లాస్ సినిమాలకు మంచి రివ్యూస్ వచ్చినా అందుకు తగ్గ వసూళ్లు ఉండవు. అదే సమయంలో మాస్ సినిమాలకు నెగిటివ్ రివ్యూలు వచ్చినా వసూళ్ల మోత మోగుతుంటుంది. ఈ క్రిస్మస్ కు రిలీజ్ కాబోతున్న డంకి, సలార్ చిత్రాల విషయంలో కూడా ఇదే జరిగితే ఆశ్చర్యం లేదేమో.

డంకీ పక్కా క్లాస్ సినిమా. రాజకుమార్ హిరానీ మూవీ అంటే ఆటోమేటిగ్గా రివ్యూలు బాగుంటాయి. ఇక సలార్ విషయానికి వస్తే అది పక్క మాస్ మూవీ. రివ్యూలు కొంచెం అటు ఇటు గానే ఉంటాయని అంచనా. ప్రశాంత్ నీల్ చివరి సినిమా కేజిఎఫ్ రెండు భాగాలకు రివ్యూలు ఆశించిన స్థాయిలో రాలేదు. అయినా సరే ఆ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ముఖ్యంగా కేజీఎఫ్-2 అయితే సంచలనం రేపింది. నెగిటివ్ రివ్యూలను తొక్కుకుంటూ ముందుకు సాగుతూ వందల కోట్లు వసూలు సాధించింది. ఇప్పుడు సలార్ కూడా అలాగే ప్రపంచం సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా సలార్ చిత్రానికి బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు రావడం అనివార్యం అని భావిస్తున్నారు. హిందీ సినిమా డంకీతో పోటీ పడుతుండడంతో సలార్ మీద వారి శీతకన్ను స్పష్టంగా కనిపిస్తోంది. నెగిటివ్ ఆర్టికల్స్ తో ఆ సినిమాను ఆల్రెడీ టార్గెట్ చేస్తున్నారు. డంకిని అదే పనిగా లేపుతున్నారు. రేప్పొద్దున ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే.. డంకిని కొనియాడుతూ సలార్ ను డీగ్రేడ్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. అయితే ఎలివేషన్స్ సీన్లు సరిగ్గా కుదిరి, యాక్షన్ ఘట్టాలు క్లిక్ అయితే చాలు సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మోత మోగించడం ఖాయం. అప్పుడు ఎలాంటి రివ్యూలు కూడా ఆ సినిమాను ఆపలేవు. మరి చూద్దాం ఏమవుతుందో?