సలార్ మేనియా ముందు డంకీ చిన్నబోవడం షారుఖ్ ఖాన్ బృందమే కాదు ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్లు, మీడియా సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పఠాన్, జవాన్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ప్రపంచం దద్దరిల్లే స్థాయిలో బుకింగ్స్ ఉంటాయని ఊహించుకున్న ఫ్యాన్స్ కు ప్రభాస్, షారుఖ్ ల మధ్య నెంబర్ల వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. ఎలాగైనా సలార్ ని నిలువరించేందుకు నార్త్ థియేటర్లు ముఖ్యంగా సింగల్ స్క్రీన్లను చేజిక్కించుకోవడంలో రెడ్ చిల్లీస్ సంస్థతో పాటు పెన్ స్టూడియోస్, జియో సినిమా స్క్రీన్లను తమవైపు లాగేసుకునే మంత్రాంగానికి తెరతీశారని ఇన్ సైడ్ టాక్.
కళ్ళ ముందు సలార్ డిమాండ్ కనిపిస్తున్నా సరే డంకీకి ఎక్కువ స్క్రీన్లు, షోలు పడేలా ముందస్తు బుకింగ్స్ ని వాస్తవం కన్నా ఎక్కువగా కనిపించేలా కార్పొరేట్ ఎత్తుగడలు వేస్తున్నారని వినికిడి. ఇప్పుడు సహకరించపోతే రాబోయే రోజుల్లో చేతిలో ఉన్న పెద్ద బాలీవుడ్ సినిమలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఎగ్జిబిటర్లకు ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేయడంతో దానికి భయపడి డంకీకే ప్రాధాన్యం ఇస్తున్నారని మరో వెర్షన్. యాభై వేల నుంచి లక్ష టికెట్లు అమ్ముడుపోయాయని సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్లు ట్వీట్లు పెడుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో దానికి భిన్నంగా ఉంది పరిస్థితి.
కొన్ని మీడియా కథనాల ప్రకారం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ దాకా డంకీ-సలార్ ల థియేటర్ షేరింగ్ నిష్పత్తి 65-35గా ఉందని తెలిసింది. ఇవి కాకుండా యానిమల్, అక్వమెన్ లకు అవసరమైన స్క్రీన్లను రిజర్వ్ చేసి పెడుతున్నారట. హిందీ సైట్లు, పత్రికల కథనాలు సలార్ గురించి నెగటివ్ గా వండటం మొదలుపెట్టాయి. మొదటి రోజు వచ్చే హిందీ రివ్యూలు ఖచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ ని ప్రభావితం చేసేలా ఉంటాయని ప్రభాస్ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. అయినా సలార్ కటవుట్ ని ట్రైలర్ లో చూశాక దాన్ని ఎదురుకోవడం అంత సులభం కాదని డంకీకి అర్ధమయ్యే ఉంటుంది
This post was last modified on December 18, 2023 7:53 pm
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…