కన్నడ చిత్రసీమలో ఇప్పుడు ‘‘అనికా’’ పేరు మారుమోగుతోంది. ఆమె పేరు బయటకు వచ్చినంతనే.. ఉలిక్కిపడుతున్న సినీ నటీనటులు చాలామందే ఉన్నారు. ఆమె కారణంగా తమ బతుకు ఎక్కడ బస్టాండ్ అవుతుందేమోనన్న భయాందోళనలకు గురవుతున్నారు. ఇంతకీ ఈ అనికా ఎవరు? శాండల్ వుడ్ నటీనటులు ఎందుకంతగా వణికిపోవాల్సిన పనేమిటంటారా? అసలు కారణం పెద్దదే.
అనికా ఒక డ్రగ్ డీలర్. తాజాగా ఆమె పోలీసులకు దొరికింది. సినీ నటులకు.. పలువురు సెలబ్రిటీలకు ఆమె డ్రగ్స్ సప్లై చేస్తుంటారు. తాజాగా ఆమె తన క్లయింట్ లిస్టును పోలీసులకు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం బయటకు పొక్కటంతో శాండిల్ వుడ్ నటీనటుడు ఇప్పుడు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి తమను ఎక్కడ చుట్టుకుంటుందేమోనని భావిస్తున్నారు.
ఇక..అనికా విషయానికి వస్తే.. అనికా.. అనికా డి.. బిమని.. పేర్లతో ఆమె బెంగళూరు మహానగరంలో డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నట్లు తేలింది.తమిళనాడుకు చెందిన ఈ యువతి.. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సును మధ్యలో వదిలేసి గార్డెన్ సిటీకి వచ్చారు.జాబ్ కోసం ఆమె ప్రయత్నాలు వర్క్ వుట్ కాకపోవటంతో తెలిసిన వారి మాటలు విని.. తప్పుడు మార్గాన్ని పట్టింది. డ్రగ్స్ వ్యాపారం చేస్తూ.. తన నెట్ వర్క్ ను పెంచుకుంది.
ఇటీవల ముంబయి డ్రగ్ డీలర్స్ ను పట్టుకున్న పోలీసులు విచారించే క్రమంలో అనికా పేరుబయటకు వచ్చింది. దీంతో.. గుట్టుచప్పుడు కాకుండా రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయటంతో మొత్తం విషయాల్ని పూసగుచ్చినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆమె సినీ రంగానికి చెందిన తన క్లయింట్స్ వివరాల్ని అందచేసినట్లు తెలుస్తోంది. వీరి సంఖ్య దాదాపు 30 మంది వరకు ఉండొచ్చని చెబుతున్నారు. వారందరికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.
ఇప్పటికే డ్రగ్స్ దందాపై దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఇచ్చిన సమాచారంతో సినిమా రంగానికి చెందిన 15 మందికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు బావిస్తున్నారు. తాజాగా అనికా ఇచ్చిన సమాచారం కూడా తోడు కావటంతో.. శాండల్ వుడ్ లో డ్రగ్ష్ తో లింకు ఉన్న నటీనటులకు ఈసారి చిక్కులు తప్పవని చెబుతున్నారు.
This post was last modified on September 2, 2020 12:27 pm
మార్చి 28 హరిహర వీరమల్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక…
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…