చియాన్ విక్రమ్ కు బొత్తిగా టైం కలిసి రావడం లేదు కాబోలు. గత నెల అన్నీ పక్కా అనుకుని విడుదల ప్లాన్ చేసుకున్న ధృవ నక్షత్రం ఆఖరి క్షణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్లు అమ్మాక షోలు రద్దు చేయాల్సి వచ్చింది. నిర్మాత కం దర్శకుడు గౌతమ్ మీనన్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం వల్లే దీనికి మోక్షం కలగడం లేదు. తాజాగా ఇంకో ప్యాన్ ఇండియా మూవీ వాయిదా బాట పట్టేలా ఉందని చెన్నై టాక్. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ ముందు జనవరి 26 రిలీజ్ డేట్ ని అఫీషియల్ లాక్ చేసుకుంది. కానీ ఇప్పుడు డ్రాపయ్యింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తంగలాన్ షూటింగ్ పూర్తయినప్పటికీ కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతోంది. కేవలం నెల రోజులు ప్రమోషన్లకు సరిపోవనే ఉద్దేశంతో నిర్మాతలు పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకున్నారట. దీనికన్నా పలు జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో తంగలాన్ ని ప్రదర్శించి తద్వారా వచ్చే వరల్డ్ వైడ్ పాపులారిటీని పబ్లిసిటీకి వాడుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారట. థియేట్రికల్ గా రిలీజయ్యాక ఇలాంటి సినిమాలు ఫిలిం ఫెస్టివల్స్ లో సరైన ఆదరణకు నోచుకోవనే ఉద్దేశంతో ప్రణాళిక మార్చుకున్నారని తెలిసింది.
తంగలాన్ కోసం విక్రమ్ విపరీతంగా కష్టపడ్డాడు. ఐ తరహాలో ఒంటిని హూనం చేసుకుని తగ్గడం, పెరగడం లాంటి శరీర ప్రక్రియలతో మళ్ళీ రిస్క్ చేశాడు. రజనీకాంత్ తో కాలా, కబాలి లాంటి సినిమాలు తీసిన పా రంజిత్ ఈసారి పూర్తిగా షాకింగ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇందులో తన పాత్రకు మాటలే ఉండవని విక్రమ్ చెప్పిన సంగతి గుర్తే. టీమ్ తర్వాత దాన్ని ఖండించినప్పటికీ టీజర్ చూశాక మాత్రం హీరో చెప్పిందే నిజమనిపిస్తుంది. తంగలాన్ తప్పుకోవడం వల్ల ఫైటర్, వ్యూహం 2, ప్రతనిధి 2లకు కాంపిటీషన్ తగ్గించినట్టు అయ్యింది.
This post was last modified on December 18, 2023 2:01 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…