మాములుగా నెట్ ఫ్లిక్స్ అంటేనే ఖరీదైన కంటెంట్ కి మారుపేరు. కేవలం మొబైల్ లో మాత్రమే చూసుకోవాలన్న నెలకు రెండు వందల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. లేదూ టీవీతో పాటు కావాలంటే అంతకు మూడింతలు 4కె కోసం ఖర్చు పెట్టాలి. వందల కోట్ల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు నిర్మించే తీరు, క్రేజీ సినిమాలను కొనుక్కునే విధానంతో పాటు ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా బోల్డ్ అండ్ బూతు కంటెంట్ ని యథావిధిగా స్ట్రీమింగ్ చేయడం ఇంత ఫాలోయింగ్ కు ఒక కారణం. ఎందుకంటే ఈ ఓటిటికి సెన్సార్ ఉండదు. అసలు సిబిఎఫ్సి ఇచ్చిన సర్టిఫికెట్ ఇండియన్ మూవీస్ లో కూడా చూడము.
అలాంటి నెట్ ఫ్లిక్స్ తన చందాదారులకు షాక్ ఇవ్వబోతోందని డిజిటల్ వర్గాల కథనం. ఇకపై భారతీయ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సెంట్రల్ బోర్డ్ అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆమోదించిన కంటెంట్ ని మాత్రమే అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకుందట. ఈ దిశగా ఓటిటిలోనూ విప్లవాత్మక మార్పులు తేవాలని బీజీపీ సర్కారు గట్టిగానే ప్రయత్నిస్తోంది. యువతని పక్కదారి పట్టించేలా విచ్చలవిడితనాన్ని చూపిస్తున్నారని ఓటిటిల మీద కొందరు కేంద్ర మంత్రులు ఆ మధ్య తీవ్ర విమర్శలు చేశారు. అందులో భాగంగా విధి విధానాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు.
ఇది ఒకరకంగా సంచలనమే అని చెప్పాలి. ఎందుకంటే థియేట్రికల్ వెర్షన్ లో ఎగిరిపోయిన సీన్లు, పాటలు నెట్ ఫ్లిక్స్ లాంటి వాటిలో చూసుకోవచ్చని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ఇది షాకే. ఉదాహరణకు యానిమల్ నే తీసుకుంటే ఎడిటింగ్ లో తీసేసిన ఫుటేజ్ అరగంటకు పైగానే ఉంది. మరి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ లో ఇది రావడం అనుమానమే. ఎలా చూసుకున్నా ఇది మంచి పరిణామమే. ఈ మధ్య సైకో కిల్లర్ కథలు, అడల్ట్ ఓన్లీ రామ్ కామ్ లు మరీ ఎక్కువైపోయాయి. వాటికి కొంతైనా అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి చర్యలు అవసరమే. నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
This post was last modified on December 17, 2023 2:23 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…