మాస్ మహారాజాకు విపరీతమైన అభిమానమున్న స్టార్లలో మొదటి పేరు బిగ్ బి అమితాబ్ బచ్చన్. వీలైనప్పుడంతా తన ఫ్యానిజంని చూపిస్తూనే ఉంటాడు. డాన్ శీనులో ఈ రిఫరెన్స్ ని స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు ఏకంగా టైటిల్ నే పెట్టేసుకున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఎంటర్ టైనర్ కి మిస్టర్ బచ్చన్ పేరుని ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఇవాళ పూజా కార్యక్రమాలతో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాని త్వరగా పూర్తి చేసేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
భాగశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతోంది. హిందీ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ లుక్ లో దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చేశారు. పాత బజాజ్ మోడల్ స్కూటర్ మీద రవితేజ కూర్చున్న స్టిల్ చూస్తే ఇది దాని రూపకమే అని అర్థమైపోయింది. సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తున్నాడు కాబట్టి దీనికీ ఆయనే అనుకున్నారు ఫ్యాన్స్. కానీ బడ్జెట్ పరిమితులు ప్లస్ టైం దృష్ట్యా ఆ అవకాశం మిక్కీకి వెళ్లిపోయింది. తెలుగులో మార్పులు గట్టిగానే చేస్తున్నారట.
ఇటీవలే గోపీచంద్ మలినేని ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో రవితేజ ఆ డేట్లను వృథా చేసుకోవడం ఇష్టం లేక ఇలా మిస్టర్ బచ్చన్ కి ఇచ్చేశాడు. పైగా ఉస్తాద్ కి బ్రేక్ రావడంతో హరీష్ శంకర్ ఎంత లేదన్నా ఆరు నెలలు ఖాళీగా ఉండబోతున్నాడు. ఆలోగా ఇది పూర్తి చేసేయొచ్చు. ఎలాగూ ఫారిన్ లొకేషన్లు, గ్రాఫిక్స్ అవసరం లేని మనీ థ్రిల్లర్ ఇది. సో త్వరగా ఫినిష్ అవుతుంది. త్వరలోనే ఈగల్ ప్రమోషన్లలో పాల్గొనబోతున్న రవితేజ జనవరి నుంచి మిస్టర్ బచ్చన్ సెట్లలో బిజీ అవుతాడు. ధమాకా తర్వాత సోలో బ్లాక్ బస్టర్ లేని కొరత తీరడం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on December 17, 2023 11:05 am
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…