గతంలోనే కొన్ని సినిమాలు చేసినప్పటికీ విరాజ్ అశ్విన్ కి గుర్తింపు వచ్చింది బేబీతోనే. ఎక్కువ పేరు ప్రాధాన్యం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు దక్కించుకున్నప్పటికీ కథలో కీలకంగా వ్యవహరించడం వల్ల విరాజ్ సైతం జనం దృష్టిలో పడ్డాడు. అందుకే తను సోలో హీరోగా నటించిన జోరుగా హుషారుగా విడుదల చేస్తే ఆడియన్స్ కి రీచ్ అవుతుందనే ఉద్దేశంలో నిర్మాతలు నిన్న విడుదల చేశారు. అను ప్రసాద్ దర్శకత్వం వహించగా పూజిత పొన్నాడ హీరోయిన్ గా చేసింది. సాయికుమార్, బ్రహ్మాజీ, మధునందన్, రోహిణి తదితరులు పేరున్న క్యాస్టింగ్ తోనే తెరకెక్కించారు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన సంతోష్(విరాజ్ అశ్విన్)కు పెద్ద లక్ష్యాలు ఉన్నప్పటికీ పరిస్థితుల వల్ల చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించి అప్పులు తీర్చడం గురించి సతమతమవుతూ ఉంటాడు. ఒకప్పటి స్నేహితురాలే టీమ్ లీడర్ నిత్య(పూజిత పొన్నాడ). జీతం పెంచుకోవడం కోసం లేట్ ఏజ్ బ్రహ్మచారి బాస్ ఆనంద్(మధునందన్)ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డ సంతోష్ అతనికి అమ్మాయిలను ప్రేమించడం గురించి టిప్స్ చెబుతూ ఉంటాడు. అనూహ్యంగా ఆనంద్ నిత్యని ఇష్టపడటంతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. ఆ తర్వాత జరిగేది అసలు స్టోరీ.
టైటిల్ లో ఉన్న హుషారు, జోరు సినిమాలో లేకపోవడంతో పాటు దర్శకుడు అను ప్రసాద్ తీసుకున్న పాయింట్ లో ఎలాంటి కొత్తదనం లేకపోవడం నిరాశపరుస్తుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్, ఫాదర్ ఎమోషన్ ఈ మూడింటిని బ్యాలన్స్ చేసే క్రమంలో అవసరంలేని సాగతీతకు చోటివ్వడంతో కథనం ఎంతకీ ముందుకు సాగక బోర్ కొట్టిస్తుంది. కామెడీ పరంగా నవ్వించే ప్రయత్నం చేసినా అదంతా రొటీన్ గా ఉండటంతో చప్పగా అనిపిస్తుంది. ఓ రెండు పాటలు పర్వాలేదనిపించినా పేరు చూసి థియేటర్ కొచ్చిన ఆడియన్స్ ని మెప్పించడంలో పూర్తిగా తడబడింది. ఫైనల్ గా బేబీ హీరోకి సోలో బ్రేక్ కాలేకపోయింది.
This post was last modified on December 16, 2023 1:43 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…