Movie News

అమెజాన్ ప్రైమ్‌లో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్ లైఫ్’

విక్రాంత్, మెహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన భారీ బడ్జెట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్ లైఫ్’. నవంబర్ 17న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంది. విక్రాంత్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే స్టోరి, స్క్రీన్ ప్లేను అందించటం విశేషం. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమా రూపొందింది.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ హృదయం, ఖుషి చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించటం విశేషం. కోలీవుడ్ యాక్టర్ గురు సోమసుందరం ఇందులో విలన్‌గా నటించటం విశేషం. థ్రిల్లర్ మూవీ అభిమానులను, ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం బావుందంటూ మంచి రివ్యూస్ కూడా వచ్చాయి.

గుడ్ వర్సెస్ ఈవిల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన  సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘స్పార్క్ లైఫ్’లో ట్టిస్టులు టర్నులు ప్రేక్షకులను మెప్పించాయి. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటి నుంచే ప్రేక్షకులు ఇప్పుడు ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

విక్రాంత్, మెహరీన్, రుక్సర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

This post was last modified on December 16, 2023 1:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…

4 hours ago

అసెంబ్లీలో కూన క‌ల్లోలం.. స్పీక‌ర్ ఫైర్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…

6 hours ago

ఎన్నిసార్లు దొరికిపోతావు త‌మ‌న్?

టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…

6 hours ago

భయపడినట్టే దెబ్బ కొట్టిన అమరన్

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…

8 hours ago

ఆ సుకుమార్.. ఈ సుకుమార్.. ఒక్కరేనా?

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…

9 hours ago

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

10 hours ago