విడుదల దగ్గరపడే కొద్దీ ప్రభాస్ అభిమానుల్లో ఉద్వేగం పతాక స్థాయికి చేరుకుంటోంది. దానికి తగ్గట్టే అర్థరాత్రి షోలకు అనుమతులు వచ్చేలా ఉండటంతో ఆ ఉత్సాహం రెట్టింపవుతోంది. ప్రమోషన్లు భారీగా చేయకపోయినా బజ్ మాత్రం అంతకంతా పెరుగుతూ పోవడం భారీ ఓపెనింగ్స్ కి గ్యారెంటీ ఇస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్ తో పాటు రాజమౌళికి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని కీలక విషయాలు పంచుకున్నాడు. వీడియో ఇంకా బయటికి రాలేదు కానీ దానికి సంబంధించిన ముచ్చట్లు ఒక్కొక్కటిగా లీకవుతున్నాయి. వాటిలో కెజిఎఫ్ ప్రస్తావన ఉంది.
సలార్ కు కెజిఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని నీల్ కుండబద్దలు కొట్టేశాడు. సినిమాటిక్ యునివర్స్ తాను తీయలేనని ఒప్పేసుకున్నాడు. సో రాఖీ భాయ్ క్యామియో ఉంటుందనే ప్రచారానికి అఫీషియల్ గా చెక్ పడినట్టే. సలార్ క్లైమాక్స్ లో కెజిఎఫ్ లింక్ ఉంటుందని, అది ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తుందని ఏవేవో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు దర్శకుడే స్వయంగా లేదని చెప్పడంతో ఏవేవో ఊహించుకోవడం అనవసరం. పార్ట్ 1 సీజ్ ఫైర్ కథ సంపూర్ణంగా ఉండదని, రెండో భాగం కోసం ఎదురు చూసేలా ఇప్పుడు చూసే సలార్ ముగింపు ఉంటుందని అన్నాడు.
మొత్తానికి ఒక పెద్ద సస్పెన్స్ కి తెరవీడిపోయింది. సలార్ బుకింగ్స్ ఇతర రాష్ట్రాల్లో మొదలైపోయాయి. తెలంగాణలో మరికొన్ని గంటల్లో షురూ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అనుమతుల కోసం ఇంకా ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. రాజమౌళికి మొదటి టికెట్ అమ్మడం ద్వారా లాంఛనం పూర్తి చేశారు కాబట్టి ఏ నిమిషంలో అయినా హైదరాబాద్ బుకింగ్స్ తెరుచుకుంటాయి. ప్రశాంత్ నీల్ ఇంకా చాలా విషయాలు పంచుకున్నారని ఇన్ సైడ్ టాక్. కుదిరితే ఆదివారం లేదా సోమవారం పూర్తి వెర్షన్ ని రిలీజ్ చేస్తారు. ఇది మినహాయించి ప్రభాస్ మరో పబ్లిక్ అప్పీయరెన్స్ సలార్ కు సంబంధించి ఇవ్వకపోవచ్చు.
This post was last modified on December 16, 2023 10:54 am
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష…