సోషల్ మీడియాలో రికార్డుల కోసం అభిమానుల వేలం వెర్రి కొనసాగుతోంది. కొత్తగా ట్వీట్ల రికార్డులు ప్రతిష్టాత్మకంగా మారిపోతున్నాయి అభిమానులకు. కొత్త సినిమాల రిలీజ్‌లు లేవు. వాటి కలెక్షన్ల గురించి కొట్టుకునే పరిస్థితి లేదు. దీంతో సోషల్ మీడియాలో అమీతుమీ తేల్చుకుంటున్నారు. హీరోల పుట్టిన రోజుల్ని పురస్కరించుకుని కామన్ హ్యాష్ ట్యాగ్ పెట్టి అందరూ దాని మీద ట్వీట్లు వేయడం.. 24 గంటల వ్యవధిలో ఎన్ని ట్వీట్లు వేశాం అన్నదాని మీద సవాళ్లు విసురుకోవడం లాక్ డౌన్లో మొదలైన కొత్త సంస్కృతి. కోటి ట్వీట్ల మార్కుతో మొదలైన ఈ రికార్డుల గొడవ.. ఇప్పుడు 6 కోట్ల రేంజిని దాటేసింది. గత నెలలో మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని అతడి అభిమానులు 60 మిలియన్ ట్వీట్లతో కొత్త రికార్డు నెలకొల్పారు. అది ప్రపంచ రికార్డు కావడం విశేషం.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ‘అడ్వాన్స్ బర్త్ డే’ ట్రెండ్‌తోనే ఈ రికార్డును బద్దలు కొట్టేశారు. వాళ్ల ట్రెండ్ 65 మిలియన్ల ట్వీట్ల వరకు వెళ్లింది. ఐతే వాళ్లు అంతటితో సంతృప్తి చెందట్లేదు. కొత్త టార్గెట్‌తో రెడీ అయిపోయారు పవన్ ఫ్యాన్స్. ఈసారి వాళ్ల టార్గెట్ 100 మిలియన్స్.. అంటే 10 కోట్ల ట్వీట్లట. బుధవారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. మంగళవారం సాయంత్రం ఈ ట్రెండ్ మొదలుపెట్టారు. ఐతే కొన్ని రోజుల కిందటే చిరంజీవి పుట్టిన రోజు వచ్చింది. అప్పుడు చిరు అభిమానులు ఇలాంటి ట్రెండ్‌ల జోలికి వెళ్లలేదు. పనిగట్టుకుని ట్వీట్లు వేసే పని పెట్టుకోలేదు. మామూలుగా అభిమానులు స్పందిస్తూ.. 3 మిలియన్ల దాకా ట్వీట్లు వేశారు. అనవసరంగా ప్రయాస పడలేదు. ఒక్కొక్కరు వందల్లో వేలల్లో ట్వీట్లు వేయాలని కూర్చోలేదు. చిరు విషయంలో అలా ఆలోచించని మెగా అభిమానులకు పవన్ విషయంలో మాత్రం ఇంత పట్టుదల ఏమిటో? ఇలాంటి రికార్డులతో వచ్చే ప్రయోజనమేంటో?
This post was last modified on September 2, 2020 12:50 am
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…