ఉప్పెన విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక కృతి శెట్టికి తిరుగులేదనే అనుకున్నారందరూ. దానికి తగ్గట్టే అవకాశాలు వచ్చాయి. నాని, నాగచైతన్య, నితిన్, రామ్, సుధీర్ బాబు ఇలా మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరోలందరూ తననే ఫస్ట్ ఛాయస్ గా తీసుకున్నారు. తీరా చూస్తే శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్లే. ఈ దెబ్బ మాములుగా లేదు. ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అయిపోయింది. కోటి దాటిన రెమ్యునరేషన్ కు కోతలు అడిగారు నిర్మాతలు. ఇంకోవైపు శ్రీలీల దూకుడుతో ఒక్కసారిగా కృతికి అవకాశాలు తగ్గిపోయాయి. అయినా పక్క బాషలు ఆదుకుంటున్నాయి.
తెలుగు వరకు చూసుకుంటే కృతి శెట్టి చేతిలో శర్వానంద్ సినిమా ఒకటే ఉంది. ఇది కూడా ఆలస్యమవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. తమిళంలో మాత్రం మంచి ఛాన్సులే వస్తున్నాయి. కార్తీతో వా వాతియారే, జయం రవి సరసన జెనీలో జోడి కట్టింది. తాజాగా లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాధన్ కు ఓకే చెప్పింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో హీరోయిన్ గా షూటింగ్ మొదలుపెట్టుకుంది. మలయాళంలో అజయంటే రండం మోశానంలో టోవినో థామస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇవన్నీ వచ్చే ఏడాది వరసగా విడుదల కాబోతున్నాయి.
ఒకరకంగా కృతి లక్కీనే. ఎందుకంటే హిట్లు లేక మెహ్రీన్, రాశి ఖన్నా లాంటి వాళ్ళు రేస్ లో వెనుకబడితే ఈ అమ్మడికి మాత్రం కోలీవుడ్ నుంచి పిలుపులు వస్తున్నాయి. శర్వానంద్ తో చేస్తున్నది హిట్ అయితే తిరిగి ఇక్కడ కుదురుకోవచ్చు కానీ లేట్ అవుతోంది కాబట్టి వెయిట్ చేయడమే బెటర్. సూర్య సరసన ఛాన్స్ వచ్చినట్టే వచ్చి ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో నిరాశ పడింది కానీ అతని తమ్ముడు కార్తీ సరసన తళుక్కుమననుంది. సినీ పరిశ్రమలో మాట్లాడేది సక్సెసే కాబట్టి అది ఉంటేనే ప్రొడ్యూసర్ల నుంచి కాల్స్ వస్తాయి. లేదంటే ఇలా షిఫ్ట్ అయిపోవడం ఉత్తమమైన పని.
This post was last modified on December 15, 2023 2:38 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…