టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు పవన్ కళ్యాణ్. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఈ రేంజిలో ఉన్నప్పటికీ మిగతా హీరోల్లాగా తన సినిమాల ఫలితాలు, కలెక్షన్లు, రికార్డుల గురించి కానీ.. తన పుట్టిన రోజు వేడుకలప్పుడు అభిమానుల హంగామా గురించి కానీ పవన్ పెద్దగా స్పందించడు. అవేమీ పట్టనట్లు ఉండిపోతాడు. ఐతే ఈసారి మాత్రం తన పుట్టిన రోజు ముంగిట పవన్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిమానులు చేసే సందడి గురించి.. చిన్నతనం నుంచి పుట్టిన రోజు నాడు ఎదురైన అనుభవాల గురించి పవన్ ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. చిన్నతనం నుంచే పుట్టిన రోజు వేడుకల పట్ల తనకు అంత ఆసక్తి లేదని.. ఒక దశ దాటాక అవి ఎబ్బెట్టుగా అనిపించి మానేశానని పవన్ చెప్పాడు. ఐతే ప్రస్తుతం తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు, మంచి పనులు మాత్రం తనకెంతో ఆనందాన్నిస్తున్నట్లు పవన్ వెల్లడించాడు. ఇంకా తన పుట్టిన రోజు వేడుకల విషయమై ఈ ఇంటర్వ్యూలో పవన్ ఏమన్నాడంటే..
‘‘చిన్నతనంలో నా పుట్టిన రోజుకు ఒకట్రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్లు పంచినట్లు గుర్తు. తర్వాత అలాంటివన్నీ పక్కన పెట్టేశాను. ఒక దశ దాటాక నా పుట్టిన రోజును నేనే కాక మా ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయేవాళ్లు. రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునేవాణ్ని. అంతకుమించి ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటు లేదు. సినిమాల్లోకి వచ్చాక స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేయాలని చూసినా ఇబ్బందిగా అనిపించేది. కేక్ కట్ చేయడం.. వాళ్లు నా నోట్లో కేక్ పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే పూర్తిగా మానేశాను. ఇక అభిమానుల విషయానికి వస్తే నన్ను లక్షలాది మంది అభిమానించడం, అదరించడం, నా పుట్టిన రోజు వేడుకలు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. నా ప్రమేయం లేకుండా నా పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా వారోత్సవాలు చేస్తున్నారు. అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనం. వారికి నా తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది’’ అని పవన్ పేర్కొన్నాడు.
This post was last modified on September 1, 2020 10:03 pm
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…