Animal
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆలోచనా విధానం ఏ స్థాయిలో ఉంటుందో అర్జున్ రెడ్డి, యానిమల్ లో చూశాం కానీ ఎడిటింగ్ లో పక్కన పెట్టిన ఫుటేజ్ లో సంగతులు వింటే ఇంకెన్ని హింసాత్మక ఆలోచనలు ఉన్నాయో అనిపిస్తుంది. క్లైమాక్స్ లో రన్బీర్ కపూర్, బాబీ డియోల్ మధ్య విమానం దగ్గర జరిగే ఫైట్ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ లో అన్నా దమ్ముళ్ల బంధాన్ని వివరించే సెంటిమెంట్ సాంగ్ రావడం మొదట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రి మీద హత్య ప్రయత్నం చేసినవాడు ఎంత సవితి సోదరుడైనా సరే నరికి అవతల పారేయకుండా కొట్టుకుంటూ ఈ పాట ఏంటనే డౌట్ కలగడం సహజం.
దీనికి ఇంకో కోణం వివరించాడు బాబీ డియోల్. నిజానికి సందీప్ వంగా ఈ ఇద్దరి మధ్య ఒక ముద్దుని కూడా షూట్ చేశాడట. చంపుకోవడం ఎందుకు, ఇప్పుడు కూడా రాజీ పడే అవకాశం ఉందనే రీతిలో ఆ ప్రేమని చుంబనం ద్వారా వ్యక్తపరిచేలా సీన్ రాసుకున్నాడు వంగా. తీరా ఎడిట్ చేసేటప్పుడు అది తప్పుడు సంకేతం ఇచ్చి, రణ్ విజయ్ పగలో డెప్త్ ని తగ్గించేస్తుందని భావించి ఇష్టం లేకపోయినా కత్తెర వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఫైనల్ వెర్షన్ చూశాక బాబీ డియోల్ కు అర్థమైంది. ఒకవేళ ఓటిటిలో అన్ కట్ వెర్షన్ వస్తే అప్పుడా సీన్ ని ఎంజాయ్ చేయొచ్చని అంటున్నాడు.
ఇదంతా ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీనే స్వయంగా వెల్లడించడం విశేషం. యానిమల్ దెబ్బకు ఇప్పుడితని డిమాండ్ మాములుగా లేదు. మొన్నటి దాకా నాలుగు కోట్లు ఉన్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఏకంగా డబుల్ డిజిట్ దాటిపోయిందట. పైగా తెలుగు తమిళం నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. హిందీలో భారీ పారితోషికాలతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. సక్సెస్ కి మొహం వాచిపోయిన ఇతనికి కేవలం ఓ ముప్పావు గంట అబ్రార్ పాత్ర గొప్ప ఇన్నింగ్స్ నిర్మించి ఇచ్చింది. క్యారెక్టర్ చనిపోయినా యానిమల్ పార్క్ లో తనకూ చోటు ఉంటుందని ఆశిస్తున్నాడు బాబీ డియోల్.
This post was last modified on December 14, 2023 8:13 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…