Movie News

నాని వెంటపడుతున్న తమిళ దర్శకులు

న్యాచురల్ స్టార్ నాని వైపు కోలీవుడ్ దర్శకులు కన్నేస్తున్నారు. ఈ సంవత్సరం దసరా లాంటి ఊర మాస్ కమర్షియల్ సినిమా, హాయ్ నాన్న లాంటి హెవీ ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా రెండింటితోనూ విజయాలు అందుకోవడంతో ఎలాగైనా సరే తమ కథలతో ఒప్పించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముందుగా కలిసింది శిబి చక్రవర్తి. శివ కార్తికేయన్ కాలేజీ డాన్ తో తెలుగులోనూ సక్సెస్ కొట్టిన ఇతను నానికో స్టోరీ చెప్పి దాదాపు ఓకే చేయించుకున్నాడు. అయితే బడ్జెట్ వంద కోట్లని చెప్పడంతో ప్రొడ్యూసర్లు వెనుకడుగు వేశారు. దీంతో ఆఫీస్ ఓపెన్ చేశాక ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యే పరిస్థితి వచ్చింది.

ఇప్పుడీ లిస్టులో కార్తీక్ సుబ్బరాజ్ చేరాడు. నాని కోసం ఒక సబ్జెక్టుని తయారు చేశాడట. అయితే తన నెరేషన్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మన ప్రేక్షకులకు అంత సులభంగా కనెక్ట్ కాదు. జిగర్ తండా డబుల్ ఎక్స్ తమిళంలో సూపర్ హిట్ అయితే ఇక్కడ డిజాస్టర్ కొట్టింది. పేట కూడా యావరేజే. పైగా ఇతను ఎవరి మాట వినే రకం కాదు. తాను రాసింది మార్చమంటే అస్సలు ఒప్పుకోడు. ఈ సంగతి ఎస్జె సూర్య, లారెన్స్ లు స్వయంగా చెప్పారు. పైగా నెమ్మదిగా తీస్తాడు, రీ షూట్లు ఎక్కువ ఉంటాయని మరో పేరుంది. సో విన్నంత తేలిగ్గా ఈ కాంబినేషన్ సెట్ కావడం ఈజీ కాదు.

ఇవన్నీ ప్రతిపాదన దశలో ఉన్నవే. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం మీద సీరియస్ ఫోకస్ పెడుతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. ఇది కాకుండా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. వర్సటైల్ యాక్టర్ గా నిరూపించుకునే క్రమంలో ఒకదానితో మరొకటి సంబంధం లేని కథలు దర్శకులను ఎంచుకుంటున్న నాని యుఎస్ లో హాయ్ నాన్న ప్రమోషన్లు పూర్తి చేసుకుని వచ్చాక నిర్ణయాలు తీసుకోబోతున్నాడు.

This post was last modified on December 14, 2023 8:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు మార్కు చొరవ ఎవ్వరికీ సాధ్యం కాదంతే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…

1 hour ago

డాల్బీ థియేటర్లు వస్తున్నాయ్….హైదరాబాద్ కూడా

మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…

2 hours ago

మిరాయ్ మెరుపుల్లో దగ్గుబాటి రానా

హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago

పాస్టర్ ప్రవీణ్.. ఇంకో కీలక వీడియో బయటికి

క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…

4 hours ago

కన్నప్ప ప్రీమియర్ వెనుక కహానీ ఏంటంటే

నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…

4 hours ago

ఏపీపై అమిత్ షా ఫోకస్ పెరిగినట్టే

వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…

5 hours ago