Movie News

సంక్రాంతి సినిమాలకు బీసీ సెంటర్ల చిక్కుముడి

తెలుగు రాష్ట్రాల్లోని చాలా పట్టణాల్లో థియేటర్ల సంఖ్య అయిదు నుంచి పది మధ్యలోనే ఉంది. ఇక సి, డి సెంటర్లుగా చెప్పుకునే గ్రామాల్లో మూడు కంటే ఎక్కువ ఉండవు. జిల్లా కేంద్రాల్లో మాత్రమే పదిహేనుకి పైగా చూడొచ్చు. అది కూడా మల్టీప్లెక్సుల పుణ్యమాని స్క్రీన్లు పెరిగాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా కిందకు ఉండేది. సంక్రాంతికి ఎవరికి వారు తగ్గమని మొండికేయడంతో వీటి సర్దుబాటు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సమస్యగా మారబోతోంది. ముందు జాగ్రత్తగా అడ్వాన్సులు ఇచ్చి బ్లాక్ చేయడం లాంటివి చేస్తున్నారు కానీ డిమాండ్ కు తగ్గ సప్ప్లై లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఓవర్ ఫ్లోస్ వల్ల ప్రొడ్యూసర్లు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది.

గుంటూరు కారంకి ఉన్న బజ్ నేపథ్యంలో దానికి వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లు ఇవ్వడం ధర్మమే. అలా అని వెంకటేష్, రవితేజ, నాగార్జున మార్కెట్ ని తక్కువంచనా వేయడానికి లేదు. ఓ చిన్న ఊళ్ళో మూడే థియేటర్లు ఉంటే ఇక్కడ చెప్పిన వాటిలో నాలుగోది రావడం అసాధ్యం. ఏదైనా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఉన్న అయిదు షోలు ఏ మూలకు సరిపోవు. పోటీ లేని టైంలో అయితే సులభంగా రెండు మూడు స్క్రీన్లు మహేష్ రేంజ్ హీరోలకు సులభంగా ఇస్తారు. వీటికే ఇలా ఉంటే మరి హనుమాన్ కి ఎలా సర్దుబాటు చేస్తారనేది పెద్ద ఛాలెంజ్. కొన్ని చోట్ల రిలీజే ఉండకపోయే రిస్క్ ఉంది. తేజ సజ్జ మార్కెట్ కన్నా గ్రాఫిక్స్ మీద ఎక్కువ ప్రమోషన్ చేస్తున్న మూవీ ఇది.

గతంలోనూ ఈ సమస్య వచ్చింది కానీ ఇంత తీవ్రంగా అయితే లేదు. హేమాహేమీ హీరోలు ఒకేసారి బరిలో దిగితే ఇలాగే ఉంటుంది. పంపకాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అభిమానులు నిర్మాతల మీద సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తారు. మా హీరోకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల విషయంలో ఈ వాదోపవాదాలు జరిగాయి. అన్ని ఒకే రోజు రావడం లేదు. కానీ గుంటూరు కారం-హనుమాన్, సైంధవ్-ఈగల్ క్లాష్ అవుతున్నాయి. నా సామిరంగా రేపో ఎల్లుండో నిర్ణయం తీసుకుంటారు. ఇంత టైట్ షెడ్యూల్ లో ధనుష్, రజనీకాంత్, శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమాలు వచ్చేందుకు ప్రయత్నం చేయడం ఇంకో ట్విస్టు.

This post was last modified on December 13, 2023 7:41 pm

Share

Recent Posts

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

46 minutes ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

2 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

3 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

3 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

4 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

7 hours ago