Movie News

ఓవర్సీస్ బుకింగుల్లో సలార్ రాజముద్ర

కేవలం 240 గంటల్లో సలార్ విడుదలనే తలంపే ప్రభాస్ అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అయితే నిర్మాతలు ప్రమోషన్ విషయంలో వహిస్తున్న అలక్ష్యం పట్ల మాత్రం అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. నిజానికి సలార్ స్టామినాని ప్రొడ్యూసర్లతో సహా అపోజిషన్ ఎంత తక్కువగా అంచనా వేస్తుందో ఒక్క చిన్న ఉదాహరణ చాలు. అమెరికాలో ప్రీమియర్ల అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సలార్ 347 లొకేషన్లకు గాను 6 లక్షల డాలర్ల దాకా వసూలు చేయగా డంకీ అంతే స్థాయిలో 328 లొకేషన్లను దక్కించుకున్నప్పటికీ కేవలం 90 వేల డాలర్లను అతి కష్టం మీద దాటగలిగింది.

ఈ ఫిగర్లు చెబుతాయి సలార్ ఫీవర్ ఏ స్థాయిలో ఆడియన్స్ లో ఉందో. రాజ్ కుమార్ హిరానీ బ్రాండ్, రెండు వెయ్యి కోట్లు సాధించిన షారుఖ్ ఖాన్ మార్కెట్ ఇవేవీ డంకీకి ప్లస్ కావడం లేదు. పైగా ట్రైలర్ కు మిశ్రమ స్పందన రావడంతో రెడ్ చిల్లీస్ పాలుపోని పరిస్థితిలో ఇరుక్కుంది. వాయిదా వేయమని బయ్యర్లు ఎంతగా పోరినా వెనక్కు తగ్గేదెలే అంటూ సిద్ధపడిన వైనం నష్టం చేసేలా ఉంది. సలార్ కు కెజిఎఫ్ రేంజ్ లో హోంబాలే ఫిలిమ్స్ పబ్లిసిటీ చేయడం లేదు. ఫస్ట్ ఆడీయో సింగల్ ప్రకటన కూడా ఇవాళ వస్తోంది. కొత్త ట్రైలర్ ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పడం లేదు.

వీటి సంగతి ఎలా ఉన్నా కంటెంట్ మాట్లాడితే చాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బెనిఫిట్ షోలు ఏ సమయానికి మొదలవుతాయనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ముందైతే టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు రావాలి. ఏపీలో ఎలాంటి కండీషన్లు పెడతారో తెలియదు. తెలంగాణలో ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళ ఆలోచనా ధోరణి ఎలా ఉండబోతోందో సలార్ వ్యవహారంలో తేలిపోతుంది. అర మిలియన్ అడ్వాన్స్ లోనే దాటేసిన సలార్ డిసెంబర్ 22 లోపే రెండు మిలియన్లు చేరుకున్నా ఆశ్చర్యం లేదు. ఇండియా వైడ్ బుకింగ్స్ శుక్రవారం నుంచి మొదలుపెడతారు.

This post was last modified on December 12, 2023 3:11 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

2 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

3 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

11 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

12 hours ago