గురు నుంచి వెంకటేష్ పూర్తి యాక్షన్ మాస్ సినిమా చేయడమే మానేశారు. ఎఫ్2, ఎఫ్3 రెండూ కామెడీ ఎంటర్ టైనర్లు. నారప్ప ఓటిటి రిలీజ్ కావడంతో దాని స్థాయి జనాలకు తెలియలేదు. దృశ్యం 2 ఫ్యామిలీ థ్రిల్లర్ కావడంతో దాని రీచ్ పరిమితమే. అందుకే అభిమానుల ఆశలన్నీ సైంధవ్ మీద ఉన్నాయి. జనవరి 13 విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో వెంకీ చాలా ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇంత వయొలెంట్ మాస్ ని చూసి ఫ్యాన్స్ వేరెత్తిపోవడం ఖాయమని ఊరిస్తున్నారు. సరే ఒక్కడున్నాడు ఏంటనే పాయింట్ కి వద్దాం.
సైంధవ్ కథ పాపను బ్రతికించుకోవడానికి అవసరమైన ఒక ఇంజెక్షన్ చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్. అదేం పెద్ద విషయం అనుకోకండి. అరుదైన వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం వాడే ఆ సూది మందు ధర 17 కోట్లకు పై మాటే. ఇది విలన్ నవాజుద్దీన్ సిద్ధిక్ కూడా అవసరం పడటంతో ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఒకప్పుడు శత్రువులైన వెంకీ, నవాజ్ లు దీని కోసం హింసాత్మక నరమేధానికి తెరతీస్తారు. ఇదంతా దర్శకుడు శైలేష్ కొలను చాలా డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో తీశాడట. 2007లో గోపిచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి ఒక్కడున్నాడు వచ్చింది.
అందులో అరుదైన బాంబే బ్లడ్ కోసం హీరోని చంపేందుకు విలన్ మహేష్ మంజ్రేకర్ ముఠా వెంటపడుతుంది. ఫస్ట్ హాఫ్ లో మంచి థ్రిల్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు యేలేటి. రెండో సగం దెబ్బ కొట్టడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. అక్కడ రక్తం కోసం కొట్టుకుంటే ఇక్కడ ఇంజెక్షన్ కోసం వార్ చేస్తారు. అలా అని రెండు స్టోరీ లైన్స్ ఒకటే కాదు కానీ ఇద్దరు దర్శకులు మాత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా వీటి కథలు రాసుకోవడం గమనించాల్సిన విషయం. సైంధవ్ లో శ్రద్ధ శ్రీనాథ్, ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా సైంధవ్ కాన్ఫిడెంట్ గా ఉంది.
This post was last modified on December 11, 2023 5:37 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…