సంక్రాంతి సినిమాల పందెం చాలా రసవత్తరంగా మారుతోంది. ఫస్ట్ కాపీ ఇంకా ఎవరిదీ సిద్ధం కాలేదు కానీ ఆయా దర్శక నిర్మాతలందరూ పోస్ట్ ప్రొడక్షన్లు, ప్రమోషన్లు చేసుకుంటున్నారు. జనవరి 12 గుంటూరు కారం – హనుమాన్, జనవరి 13 సైంధవ్ – ఈగల్ ఇప్పటిదాకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసుకున్న డేట్లు. ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. డబ్బింగ్ సినిమాలు రజినీకాంత్ లాల్ సలామ్, ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలన్ ఇంకా తేదీలను ఖరారు చేసుకోలేదు. వీటి సంగతి పక్కనపెడితే నా సామిరంగా సైతం పండగ బరికే రెడీ అవుతోంది.
సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సెంటిమెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని కంకణం కట్టుకున్న నాగార్జున ఈసారి అందరికంటే ముందొచ్చే ఆలోచన చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. జనవరి 10 లేదా 11 వీటిలో ఏదో ఒకటి లాక్ చేసుకుని మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. టాక్ మీద ఎలాగూ నమ్మకం ఉంది కాబట్టి ప్రేక్షకులు కనక ఆదరిస్తే తర్వాత వచ్చేవాటి ఫలితంతో సంబంధం లేకుండా నిలబడవచ్చని ఆలోచిస్తున్నారట. పైగా అగ్రిమెంట్లు ముందుగానే చేసుకుంటారు కాబట్టి హఠాత్తుగా థియేటర్ల నుంచి తీసేయడం లాంటివి జరగకపోవచ్చు. ఇవన్నీ సీరియస్ గా విశ్లేషిస్తున్నారు.
ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుని ట్రైలర్ తో పాటుగా ప్రకటించే అవకాశాలు పెరుగుతున్నాయి. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న నా సామిరంగాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్నేళ్లుగా యాక్షన్ డ్రామాలతో అవసరం లేని ప్రయోగాలు చేసి వరసగా దెబ్బ తిన్న నాగార్జునకి మాస్ లో తగ్గిపోయిన పట్టుని తిరిగి నిలబెట్టే సత్తా నా సామి రంగాకు ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ పాయింట్ ని తీసుకుని తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చారు.
This post was last modified on December 10, 2023 2:11 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…