Movie News

డబుల్ ఆఫర్లతో తెలుగులో త్రిష పునఃప్రవేశం

ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించిన త్రిష తర్వాత అవకాశాలు తగ్గిపోయి పూర్తిగా తమిళంకే అంకితమైపోయింది. అయితే పొన్నియిన్ సెల్వన్ చూశాక జనాల అభిప్రాయాలు మారిపోయాయి. పదిహేనేళ్ల కెరీర్ తర్వాత కూడా త్రిష ఇంత అందంగా నటించడం చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. విజయ్ లియోలో ఏరికోరి ఆమెను తీసుకోవడానికి కారణం ఇదే. అజిత్ సరసన ఆఫర్ కొట్టేసింది. సోలోగా నటించే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓటిటిలో మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పుడు తన కాంబో కోరుకుంటున్న వాళ్ళలో తెలుగు స్టార్లు కూడా ఉన్నారు.  

చిరంజీవి విశ్వంభరలో త్రిష హీరోయిన్ కావడం కన్ఫర్మే. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ త్వరలోనే ప్రకటన ఇచ్చేందుకు సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారు. అజిత్ తో షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న త్రిష తిరిగి రాగానే డేట్ల సర్దుబాటుని బట్టి డేట్స్ ప్లాన్ చేస్తారు. గతంలో ఈ కాంబోలో స్టాలిన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు నవీన్ తో చేయబోయే మూవీకి కూడా త్రిషనే అనుకుంటున్నారట. లవ్ యాక్షన్ రొమాన్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి సూర్య బంధువు జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

అధికారికంగా చెప్పకపోయినా ఈ రెండు ఫిక్స్ చేసుకున్నట్టే. నిజానికి ఈ సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ ఇంత స్పీడ్ గా ఉంటుందని త్రిష ఊహించి ఉండదు. నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న సాటి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతే తను మాత్రం ఇంకా టాప్ డిమాండ్ లో ఉండటం అనూహ్యమే. నాగ్ త్రిషల కలయిక కింగ్ గొప్ప విజయం సాధించకపోయినా అందులో కామెడీని ఇప్పటి జనాలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తిరిగి మళ్ళీ కలుసుకోవడం ఫ్యాన్స్ కి శుభవార్తే. ప్రస్తుతం నా సామి రంగా, తర్వాత ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాలతో నాగ్ బిజీగా ఉన్నాడు. 

This post was last modified on December 10, 2023 1:54 pm

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

23 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago