ఈ ఏడాది చివర్లో అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పబడుతున్న సలార్ వర్సెస్ డంకీలో వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రభాస్ కి 119 షోల నుంచి ఇప్పటిదాకా వసూలైన మొత్తం అక్కడి దేశపు డాలర్లలో సుమారు 69 వేలు కాగా డంకీ కేవలం 57 షోల నుంచి కనీసం 6 వేలు దాటడానికి కష్టపడింది. ఇక అమెరికా సంగతి చూస్తే 1000 పైగా షోలతో సలార్ ఆర మిలియన్ దాటేందుకు అడుగుల దూరంలో ఉండగా డంకీ 350 పైగా షోలతో కేవలం 50 వేల డాలర్లతో ఎదురీదుతోంది. ఇంకా పన్నెండు రోజుల టైం ఉంది.
ఈ లెక్కలు షారుఖ్ ఖాన్ టీమ్ ని టెన్షన్ పెడుతున్న మాట వాస్తవం. జవాన్,పఠాన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తానేం ప్రమోట్ చేయకపోయినా డంకీకి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెడతాయని ఊహించిన బాద్షాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రైలర్ వచ్చాక నెగటివ్ వైబ్స్ రావడంతో ఖంగారుని మరింతగా పెంచుతోంది. కల్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరానీ బ్రాండ్ ఇంత వీక్ గా ఓవర్సీస్ లో ఎప్పుడూ పని చేయలేదు. ఈయన గత చిత్రాలు పీకే, సంజులు మాములు రచ్చ చేయలేదు. ఏళ్ళ తరబడి గ్యాప్ తీసుకున్నా జనాలు ఎగబడకపోవడం విచిత్రం.
రాబోయే రోజుల్లో ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతోంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. సలార్ ట్రైలర్ కు సైతం భీభత్సమైన రెస్పాన్స్ రాలేదు. అయినా సరే డంకీ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా మాస్ ని ఆకట్టుకునేలా ఉండటం ఓపెనింగ్స్ కి దోహద పడేలా చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మెల్లగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ప్రభాస్ కల్కి నుంచి కాస్త బ్రేక్ తీసుకుని వచ్చే వారం నుంచి జాయిన్ కాబోతున్నాడు. కొత్త ట్రైలర్ ని రెండో వారం చివర్లో రిలీజ్ చేస్తారు. చూస్తుంటే నాలుగేళ్ళ క్రితం కెజిఎఫ్ వల్ల జీరో దెబ్బ తిన్నట్టు ఇప్పుడు సలార్ పుణ్యమాని డంకీ షాక్ ఏమైనా చూస్తాడేమో.
This post was last modified on December 9, 2023 11:19 pm
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…