నిర్మాత సేఫ్ అవ్వాలంటే దర్శకుడు బడ్జెట్ ని కంట్రోల్ ఉంచాలి. హెచ్చుతగ్గులు సహజమే కానీ మరీ హద్దులు మీరితే చాలా ప్రమాదం. కల్ట్ దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగులోనూ పేరున్న వెట్రిమారన్ దీనికి సంబందించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ ఏడాది విమర్శకుల ప్రశంసలు అందుకున్న విడుదల పార్ట్ 1 కోసం ముందు వేసుకున్న బడ్జెట్ 4 కోట్ల 50 లక్షలు. ఒక ఎత్తైన కొండ ప్రాంతంని షూటింగ్ కోసం ఎంచుకుని అక్కడ 250 మందికి సరిపడా టెంట్లు వేశారు. దగ్గర్లోని గ్రామస్థులకు కూడా ఉపయోగపడేలా పన్నెండు టాయిలెట్లు నిర్మించి అంతా సిద్ధం చేసుకున్నారు.
అక్కడికే డెబ్భై శాతం డబ్బులు ఖర్చయిపోయాయి. ఇంకా షూటింగ్ మొదలుపెట్టనేలేదు. ఈలోగా గాలి తుఫాను వచ్చి మొత్తం టెంట్లు కూలిపోయాయి. దీంతో ఇక ఈ ప్రాజెక్టు ఆగినట్టేనని వెట్రిమారన్ ఫిక్సయిపోయి అదే మాట నిర్మాతతో అన్నారు. ఇక్కడి దాకా వచ్చి వెనుకడుగు వేయడం ఎందుకని, ధైర్యంగా ముందుకు వెళదామని చెప్పడంతో లొకేషన్ మార్చుకుని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారు. ఇలా క్రమంగా రోజులు గడిచే కొద్దీ బడ్జెట్ కాస్తా 65 కోట్లకు చేరుకుంది. అంటే ముందు వేసుకున్న లెక్కలకు ఏకంగా పదిహేనింతలు ఎక్కువ. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రొడ్యూసర్ నిలువునా మునిగిపోతాడు.
35 రోజుల్లో పూర్తి చేయాలనుకున్న సినిమా కాస్తా ఏకంగా నెలల తరబడి నిర్మాణం జరుపుకుంది. రెండు భాగాలకు రెడీ అయ్యాడు. అదృష్టవశాత్తు తమిళంలో విడుదల పార్ట్ 1 వర్కౌట్ అయ్యింది. సీక్వెల్ కు కావాల్సిన బజ్, డిమాండ్ వచ్చాయి. ఒకవేళ డిజాస్టర్ అయ్యుంటే వెట్రిమారన్ కు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ఇదంతా ఆయనే స్వయంగా ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విడుదల పార్ట్ 2 త్వరలో ప్రారంభం కానుంది. వంద కోట్ల బడ్జెట్ కావొచ్చని చెన్నై టాక్ ఉంది. ఈసారి విజయ్ సేతుపతి కేంద్రంగా కథను నడిపించబోతున్నారు. 2024 దీపావళి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 9, 2023 11:11 pm
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…