టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీలీలకు డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. వరసగా బాక్సాఫీస్ వద్ద తనకు మూడో షాక్ తగలడం ఖాయమనేలా ఉంది పరిస్థితి. ఎక్స్ ట్రాడినరి మ్యాన్ ఫలితం ఇంకో రెండు రోజులు ఆగితే స్పష్టంగా బయట పడుతుంది కానీ శ్రీలీల పాత్ర మీద మాత్రం నెగటివ్ కామెంట్స్ గట్టిగా వస్తున్నాయి. ఏదో మొక్కుబడిగా లవ్ ట్రాక్ కోసం కాసిన్ని సీన్లు వేసి, మూడు పాటల్లో డాన్స్ చేయిస్తే చాలు ధమాకా లాగా వర్కౌట్ అవుతుందనే అంచనాతో దర్శకులు స్టోరీలో ఇస్తున్న ట్రీట్ మెంట్ తనకు పెద్ద మైనస్ అవుతోంది.
స్కందలో రామ్ డామినేషనే ఎక్కువయ్యింది. బోయపాటి ఓవర్ మాస్ వల్ల బాక్సాఫీస్ వద్ద ఆడలేదు కానీ దాంట్లో శ్రీలీలకి ఇచ్చిన ప్రాధాన్యం తక్కువే. ఇక ఆదికేశవ గురించి వీలైనంత తక్కువ మాట్లాడకుంటే మంచిది. వైష్ణవ్ తేజ్ కి మాములు షాక్ ఇవ్వలేదు. అదొకటి వచ్చిందన్న సంగతే కామన్ ఆడియన్స్ మర్చిపోయారు. దీంట్లో ఇప్పుడొచ్చిన నితిన్ మూవీలో రెండింటిలోనూ శ్రీలీల ఏదో కంపెనీలో పెద్ద పొజిషన్ లో ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం, ఆమె ఇబ్బందుల్లో పడితే హీరో వచ్చి కాపాడటం సేమ్ టు సేమ్ ఉంది. వరసగా చూస్తే గుర్తు పట్టలేనంత పోలికలుంటాయి.
ఇప్పుడు తన ఆశలన్నీ గుంటూరు కారం మీదే ఉన్నాయి. మహేష్ బాబు కాంబినేషన్ అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ మెయిన్ హీరోయిన్ ని మరీ తేలిగ్గా చూపించడు. సో నమ్మకం పెట్టుకోవచ్చు. గతంలో సమంతాకు అలా బ్రేక్ ఇవ్వడం వల్లే స్టార్ హీరోల సరసన అవకాశాలు క్యూ కట్టాయి. శ్రీలీల ఖాతాలో భగవంత్ కేసరి పెద్ద హిట్టే కానీ అందులో చేసింది బాలయ్యకు కూతురి తరహా పాత్ర కాబట్టి పెర్ఫార్మన్స్ పరంగా తప్ప గ్లామర్ కోణంలో కౌంట్ చేయలేం. సో ఇకపై శ్రీలీల తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. లేదంటే రిస్క్ లో పడక తప్పదు.
This post was last modified on December 8, 2023 5:35 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…