అన్నీ అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే రేపు గ్యాంగ్స్ అఫ్ గోదావరి విడుదల కావాల్సింది. ఆ మధ్య ఓ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ డిసెంబర్ లో రిలీజ్ కాకపోతే తాను ప్రమోషన్లలో కనిపించనని హీరో శపథం చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. తర్వాత షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడం, విశ్వక్ గాయపడటం లాంటి కారణాల వల్ల రిలీజ్ ని వచ్చే ఏడాది మార్చ్ 8కి షిఫ్ట్ చేశారు. ఇది ఎంత తెలివైన నిర్ణయమో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో కూడిన వాతావరణం జనాలను థియేటర్లకు వచ్చే మూడ్ లో ఉంచడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో.
తాజాగా హాయ్ నాన్న ఓపెనింగ్స్ ఇదే స్పష్టం చేస్తోంది. టాక్ ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా బాగానే ఉంది. కానీ ఆశించిన స్థాయిలో టికెట్ల అమ్మకాలు జోరుగా లేవు. మెయిన్ సెంటర్స్ మినహాయించి కింద స్థాయిలో డల్లుగానే ఉంది. రేపటి నుంచి ఎక్కువ శాతంలో పికప్ కావాల్సి ఉంటుంది. ఇక నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ కు సైతం అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నాయి. ఇదే హీరోల గత చిత్రాలు దసరా, మాచర్ల నియోజకవర్గంలు ఫస్ట్ డే మెరుగ్గా కనిపించాయి. రేపు మార్నింగ్ షో అయ్యాక ఎలాగూ ఫలితం తేలుతుంది కాబట్టి ఈసారి నితిన్ గెలుస్తాడా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేయాలి.
ఏది ఏమైనా గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పుకోవడం ఒకరకంగా మంచిదే. పైగా యానిమల్ ఫీవర్ లో ఉన్న యూత్ కొత్తవాటిని అంతగా పట్టించుకోవడం లేదు. దాస్ కా ధమ్కీ ఇచ్చిన ధమ్కీకి విశ్వక్ సేన్ ఆశలన్నీ గ్యాంగ్స్ మీదే ఉన్నాయి. దీని కోసమే ప్రత్యేకంగా హెయిర్ స్టైల్, ఫిజిక్ మార్చుకుని నటించాడు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా నేహశెట్టి హీరోయిన్ నటించింది. ఎలాగూ బోలెడు టైం దొరికేసింది కాబట్టి గ్యాంగ్స్ అఫ్ గోదావరి పబ్లిసిటీని సితార సంస్థ భారీగా ప్లాన్ చేస్తోంది. జనవరి 12 వచ్చే గుంటూరు కారం వచ్చాక విశ్వక్ హంగామా మొదలుపెడతారు.
This post was last modified on December 7, 2023 6:28 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…