బాలీవుడ్ బాక్సాఫీస్ ని ఊపేస్తున్న యానిమల్ మొదటి వారం పూర్తికావడానికి ఒక్క రోజు ముందే అయిదు వందల కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 527 కోట్ల 60 లక్షల గ్రాస్ తో వెయ్యి కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. ఈ ఏడాది జవాన్, పఠాన్ లను ఎవరూ దాటలేరనే అంచనాలను చిన్నాభిన్నం చేస్తూ ఒక తెలుగు దర్శకుడు ఈ సునామి సృష్టించడం విశేషం. ఒక్క నార్త్ అమెరికాలోనే కేవలం నాలుగు రోజులకే 7 మిలియన్లను దాటడం అరుదైన రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ చేసిన 15 కోట్లను కేవలం మొదటి వీకెండ్ లోపే అందుకోవడం అరుదైన ఘనత.
ఇప్పుడప్పుడే యానిమల్ నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. రెండో వారంలో హిందీలో ఒక్కటంటే ఒక్కటి సరైన సినిమా లేదు. సలార్, డంకీలు దగ్గరలో ఉండటంతో ఎవరూ రిస్క్ చేయడం లేదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ్ముడితో కలిసి ఓవర్సీస్ లో ప్రమోషన్ల కోసం వెళ్లిపోగా రన్బీర్ కపూర్, రష్మిక మందన్నలు డేట్ల సర్దుబాటుని బట్టి ఇండియాలో సక్సెస్ టూర్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వెయ్యి కోట్లు వచ్చాక టి సిరీస్ ఒక భారీ ఈవెంట్ ని ముంబైలో ప్లాన్ చేస్తోంది. ఇంత పెద్ద చరిత్ర ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు వేడుక ఉంటుందట.
పలు రాష్ట్రాల్లో వర్షాలు, ఇతరత్రా రాజకీయ కారణాల వల్ల వీక్ డేస్ లో కొంత నెమ్మదించినప్పటికీ తిరిగి శని ఆదివారాలు పూర్తిగా యానిమల్ ఆధీనంలోకి వెళ్లడం ఖాయమే. తెలుగులో హాయ్ నాన్న టాక్ వచ్చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఓకే కానీ మాస్ ఎంత వరకు కనెక్ట్ అవుతారో చెప్పలేం అన్నట్టుగా ఉంది. ఇక ఎక్స్ ట్రాడినరి మ్యాన్ జాతకం రేపు ఉదయం తేలిపోతుంది. ఒకవేళ ఈ రెండూ కనక మిశ్రమ ఫలితాలు అందుకుంటే యానిమల్ మళ్ళీ పుంజుకుంటుంది. లేదూ నితిన్ నానిలు హిట్టు కొడితే మాత్రం నెమ్మదించక తప్పదు. ముంబై మీడియా మొత్తం యానిమల్ జపంలోనే తేలుతోంది.
This post was last modified on December 7, 2023 3:02 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…