Movie News

యానిమల్.. ఒక వెరైటీ రికార్డ్

యానిమల్ సినిమాకు రిలీజ్ ముంగిట హైప్ మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్ కూడా గట్టిగానే జరిగాయి. అయినా సరే ఈ సినిమా వసూళ్ల పరంగా అందరి అంచనాలను మించిపోయింది. తొలి వీకెండ్ అయ్యేసరికి ఏకంగా 400 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. వీకెండ్ అయ్యాక కూడా ఈ సినిమా జోరేమీ తగ్గలేదు.

సోమవారం రోజు ఇండియాలో 30 కోట్ల కలెక్షన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. ఇండియాలో నార్త్ సౌత్ అని తేడా లేకుండా.. అలాగే విదేశాల్లోనూ ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది. ఈ సినిమా ఒక వెరైటీ రికార్డ్ ను ఖాతాలో వేసుకుంది. ఇండియాలో అడల్ట్ రేటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా యానిమల్ రికార్డు సృష్టించింది.

ఇప్పటిదాకా ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో ఏ అడల్ట్ రేటెడ్ మూవీ కూడా 400 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకోలేదు. తొలిసారిగా యానిమల్ ఈ ఘనత సాధించింది. విశేషం ఏంటంటే గత రికార్డు కూడా కూడా యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాదే. అతడి అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ 2019లో 375 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో అప్పట్లో అత్యధిక వసూలు సాధించిన అడల్ట్ రేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇప్పుడు యానిమల్ దాన్ని నాలుగు రోజుకే అధిగమించింది. వీక్ డేస్ లోనూ ఈ సినిమా ఊపు చూస్తుంటే క్రిస్మస్ వీకెండ్ వరకు బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం కొనసాగేలాగా ఉంది. ఫుల్ రన్లో 800 కోట్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. తెలుగులో అత్యధిక వసూళ్లు సాదించిన హిందీ డబ్బింగ్ చిత్రంగానూ యానిమల్ రికార్డులకు ఎక్కబోతోంది.

This post was last modified on December 6, 2023 1:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

5 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

6 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

7 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

10 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

10 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

10 hours ago