Movie News

నాని మాస్ వర్సెస్ నాని క్లాస్.. తేడా క్లియర్

నేచురల్ స్టార్ నాని అంటే పక్కా క్లాస్ హీరో అని ముద్ర ఉంది. అతడి కెరీర్లో మెజారిటీ సినిమాలు క్లాస్ టచ్ ఉన్నవే. వాటిలో చాలా వరకు మంచి విజయం సాధించాయి కూడా. అయితే ఎప్పుడూ ఈ క్లాస్ ముద్రతోనే ఉండిపోవడం ఏ హీరో కైనా ఇబ్బందే. మాస్ లో పెరిగితేనే మార్కెట్ కూడా పెరుగుతుంది. అందుకే నాని కూడా అప్పుడప్పుడు మాస్ సినిమాలో ట్రై చేస్తున్నాడు గత కొన్నేళ్లుగా. కొన్నేళ్ల కిందట ఎంసీఏ, ఈ ఏడాది దసరా అతడికి మంచి ఫలితాన్ని ఇచ్చాయి.

ముఖ్యంగా దసరా చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. క్లాస్ హీరోగా ముద్ర ఉన్న నాని.. మాస్ సినిమాతో చేసిన బాక్సాఫీస్ విధ్వంసం చూసి అందరూ షాక్ అయ్యారు. కేవలం ఓపెనింగ్స్ తోనే ఆ సినిమా సేఫ్ అయిపోయింది.

అయితే అంత ఊర మాస్ సినిమా తర్వాత నాని మళ్లీ తన శైలిలో హాయ్ నాన్న అనే పక్కా క్లాస్ మూవీ చేశాడు. ఇది అతని స్ట్రాంగ్ జోన్ అయినప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ లో అంతగా ఊపు కనిపించడం లేదు. బేసిగ్గా మాస్ సినిమాలకు ప్రేక్షకులు ఎగబడినట్లు క్లాస్ సినిమాలకు ఉండదు. కానీ హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ క్లాస్ లవ్ స్టోరీలతోనే నాని గతంలో ప్రేక్షకులను థియేటర్లకు బాగా పుల్ చేసేవాడు. నిన్ను కోరి లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ.

కానీ ఇప్పుడు ప్రేక్షకుల మూడ్ వేరేగా ఉంది. మాస్, యాక్షన్ సినిమాలకే ఎక్కువగా థియేటర్లకు వస్తున్నారు. అందులోనూ ఇప్పుడు యూత్ ఆడియన్స్ యానిమల్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. అది హాయ్ నాన్న మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాయ్ నాన్నకు టాక్ చాలా కీలకంగా మారింది. మరి ఆ టాక్.. ఓవరాల్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

This post was last modified on December 6, 2023 1:06 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago