తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్లను అటుంచితే టాప్ టయర్కి చెందిన హీరోలు కేవలం ఆరుగురు మాత్రమే వున్నారు. టాప్ డైరెక్టర్లు వీరితోనే సినిమాలు చేస్తుండాలి. అదే పనిగా చిన్న హీరోలతో సినిమాలు చేసినా, ఒకవేళ అగ్ర హీరోల నుంచి ఒక అడుగు కిందకు వేసినా దర్శకుడి రేంజ్ తగ్గిపోతుందనే భయాలున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్‌తో సినిమా ఓకే చేసుకున్న హరీష్ శంకర్ ఎన్నాళ్లయినా కానీ పవన్ కోసమే వేచి చూడాలని నిర్ణయించుకున్నాడు.
ఈలోగా ఒక మీడియం రేంజ్ సినిమా చేసే ఆలోచన అతనికి అస్సల్లేదు. ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తోన్న త్రివిక్రమ్‌కి కూడా ఇప్పటికిప్పుడు అందుబాటులో అగ్ర హీరో ఎవరూ లేరు. అలా అని ఏదైనా చిన్న సినిమా చేయడం అతనికి ఇష్టం లేదు. అయితే సినిమాకి కోటానుకోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకులు ఖాళీగా వుంటే ఆ వచ్చే ఆదాయానికి గండి పడినట్టే కదా. అందుకే హరీష్ శంకర్ తన బ్రాండ్ వాడుకుని తాను రాసిన స్టోరీస్ అమ్మేస్తున్నాడు.
త్రివిక్రమ్ కూడా కథలు ఇవ్వడంతో పాటు ఏవైనా పెద్ద సినిమాలకు మాటలు రాసే ఆలోచనలో వున్నట్టు చెబుతున్నారు. మామూలు రచయిత రాసే కథలకు, మాటలకు కొన్ని లక్షలు మాత్రమే వస్తాయి కానీ ఇలా బ్రాండ్ వున్న దర్శకుల మాటలకు, కథలకు కోట్లలో చెల్లించక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates