Movie News

అక్క పాత్రకు నయనతార షిఫ్ట్

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ ని అనుభవించాక కూడా తన డిమాండ్ ని అలాగే మైంటైన్ చేయడం చిన్న విషయం కాదు. ఒకప్పటిలా తెలుగులో ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ సరైన హిట్టు పడితే మళ్ళీ కంబ్యాక్ అవ్వడం పెద్ద విషయం కాదు. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ లేదా తన మీద టైటిల్ రోల్ నడిచే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన నయన్ ఈ రెండు కాకుండా వేరే పాత్రలు పోషించిన దాఖలాలు లేవు. తాజాగా భర్త కం దర్శకుడు విగ్నేష్ శివన్ కోసం ఓ మెట్టు దిగి అక్కయ్య పాత్రకు ఒప్పుకున్నట్టు కోలీవుడ్ టాక్.

లవ్ టుడే రూపంలో తక్కువ బడ్జెట్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు కం హీరో ప్రదీప్ రంగనాధన్ కథానాయకుడిగా విగ్నేష్ శివన్ ఓ సినిమా ప్లాన్ చేశాడు. దేవర ఫేమ్ జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన అక్కయ్యగా చాలా ముఖ్యమైన క్యారెక్టర్ కు భార్య నయనతారని అతను లాక్ చేసుకున్నట్టు సమాచారం. పేరుకి అలా వినిపించినా కథలో చాలా ప్రాధాన్యం ఉంటుందట. ఆమెకు జోడిగా ఇంకో హీరో ఉండకపోవచ్చని అంటున్నారు. అంతులేని కథలో జయప్రద తరహాలో పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారట.

ఇదింకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక నయనతార సినిమాలు ఎక్కువ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడొచ్చిన ప్రతిపాదన కూడా స్వయానా భర్తదే కాబట్టి నో అనకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చు. లవ్ టుడే తర్వాత హీరోగానే ఎక్కువ ఆఫర్లు వస్తుండటంతో ప్రదీప్ రంగనాథన్ ఆ దిశగానే కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. విగ్నేష్ కు భారీ బ్లాక్ బస్టర్ దక్కి చాలా గ్యాప్ వచ్చేసింది. అజిత్ తో చేయి దాకా వచ్చిన సినిమా చివరి క్షణంలో చేజారిపోవడంతో ఆశలన్నీ దీని మీద పెట్టుకున్నాడు. ఏ మాత్రం తేడా కొట్టినా స్టార్ హీరోల నుంచి పిలుపులు రావు.

This post was last modified on December 5, 2023 10:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

2 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

2 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

3 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

3 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

4 hours ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

4 hours ago