ఈ రోజుల్లో ఎంత భారీ అంచనాలతో వచ్చిన సినిమా అయినా.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ జోరు వీకెండ్ వరకే ఉంటుంది. సోమవారం రాగానే వసూళ్లు ఒక్కసారిగా పడిపోతాయి. డ్రాప్ ఏ స్థాయిలో ఉందన్నది కీలకం. అయితే అరుదుగా కొన్ని సినిమాలు మాత్రం సోమవారం కూడా దూకుడు చూపిస్తాయి. యానిమల్ ఆకోవకి చెందిన సినిమానే.
తొలి వీకెండ్ లో ట్రేడ్ పండిట్లు కూడా విస్తుపోయేలా సంచలన వసూళ్లు సాధించిన యానిమల్.. సోమవారం కూడా ఆశ్చర్యకర కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలో ఈ సినిమా నాలుగో రోజు వసూళ్లు 30 కోట్లు దాటిపోయాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ 50 కోట్లకు పైగానే ఉంది. సోమవారం సాయంత్రం, నైట్ షోలు హౌస్ ఫుల్స్ తో నడిచాయి.
ఈ సినిమా రేంజ్ కి ఈ స్థాయిలో వసూలు రావటం అద్భుతం అనే చెప్పాలి. ఇండియా అని కాకుండా వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ప్రతి చోట యానిమల్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది.
ఉత్తర అమెరికాలో యానిమల్ బ్రేక్ ఈవెన్ మార్కు మూడున్నర మిలియన్ డాలర్లు కాగా… ఇప్పటికే ఈ చిత్రం అక్కడ ఏడు మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. దీన్నిబట్టే అక్కడ ఎంత పెద్ద సక్సెస్ అన్నది అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా అన్నిచోట్ల యానిమల్ బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాటలో సాగుతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on December 5, 2023 3:00 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…