Movie News

సల్మాన్ వల్ల కానిది హృతిక్ వల్ల అవుతుందా?

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆరంభంలో వచ్చిన పఠాన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. దీనికంటే ముందే వార్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్.. పఠాన్ ను దాన్ని మించి హిట్ చేశాడు. ఈ కోవలోనే సల్మాన్ ఖాన్ సినిమా టైగర్ 3 కూడా అవుతుందని యశ్ రాజ్ ఫిలిమ్స్ ఆశించింది. కానీ అది ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అయితే ఇప్పుడు మరో భారీ బాలీవుడ్ స్పై మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అదే.. ఫైటర్. స్పై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన సిద్ధార్థ ఆనందే దీనికి కూడా దర్శకుడు. అతనితో వార్ మూవీ చేసిన హృతిక్ రోషన్ ఇందులో హీరో. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. ఆ క్రేజ్ కు తగ్గట్టే తాజాగా రిలీజ్ అయిన ఫైటర్ ఫస్ట్ లుక్ బంపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

హృతిక్ సిద్ధార్థ్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం బ్యాంగ్ బ్యాంగ్ కూడా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించింది. ఇక వార్, పఠాన్ చిత్రాల తర్వాత.. సిద్ధార్థ్ నుంచి వస్తున్న సినిమా కావడం, పైగా హృతిక్ రోషన్ హీరో కావడంతో ఈ సినిమాకు ఆకాశమే హద్దు అని భావిస్తున్నారు అభిమానులు. కానీ టైగర్ 3 కొంచెం కంగారు పెడుతుంది. స్పై థ్రిల్లర్స్ అంటే ఒక మూసలో సాగిపోతాయని ఫీలింగ్ కలిగించింది చిత్రం. వరుసుగా ఇలాంటి సినిమాలన్నీ ఒకేలా ఉంటుండటం ప్రేక్షకులకు మొనాటనస్ ఫీలింగ్ వస్తోంది. ఆ ఫీలింగ్ పోగొట్టి.. కొత్తగా ఏదైనా అందిస్తే మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. ఈ ఏడాది పఠాన్ లాగే వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వీకెండ్లో ఈ చిత్రం విడుదల కానుంది.

This post was last modified on December 4, 2023 11:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago