తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు దాటింది. ఫలితాల రోజు తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీకే అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన సినీ జనాలందరూ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఒక రోజంతా వ్యూహాత్మక మౌనం పాటించారు. కానీ మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతించారు.
తాజాగా నేచురల్ స్టార్ నాని.. ట్విట్టర్లో అభిమానులతో సంభాషణ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొత్త చిత్రం హాయ్ నాన్న ప్రమోషన్లలో భాగంగా చిట్ చాట్ జరిపిన నానిని ఎన్నికల ఫలితాలపై స్పందించమని ఒక అభిమాని అడిగాడు. అందుకు నాని బదులిస్తూ.. పదేళ్లపాటు ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూశామని.. ఇప్పుడు థియేటర్లోకి కొత్త సినిమా వచ్చిందని.. అది కూడా బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించాడు.
ఇన్నాళ్లు అధికారంలో ఉన్న తెరాసను నొప్పించకుండా కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ నూ మెప్పించేలా నాని చేసిన వ్యాఖ్యకి ఫిదా అవుతున్నారు. మరోవైపు మీరు కొత్తగా పనిచేయాలని ఆశపడుతున్న దర్శకుడు ఎవరు అని నానిని అడిగితే.. బలగం చిత్రంతో అందరి మన్ననలు పొందిన కమెడియన్ వేణు పేరు చెప్పాడు నేచురల్ స్టార్. ఎక్కువగా కొత్త యువ దర్శకులతోనే పనిచేయడంపై నాని స్పందిస్తూ తాను స్టార్ దర్శకుల కోసం ఎదురుచూడనని.. తనతో సినిమా చేయాలని ఎవరిని అడగనని.. తనకు కుదిరిన వాళ్లతో సినిమా చేసుకుపోతానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 5, 2023 10:11 am
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…