స్పై యూనివర్స్ లో భాగంగా విపరీతమైన అంచనాల మధ్య మొన్న దీపావళికి విడుదలైన టైగర్ 3 బ్లాక్ బస్టరని ఋజువు చేసేందుకు యష్ రాజ్ ఫిలిమ్స్ పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. పఠాన్, జవాన్ లను మించుతుందనే అంచనాల నుంచి అయిదు వందల కోట్లు దాటితే అదే పెద్ద ఘనతని అనుకునే దాకా వచ్చింది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన ప్రకారం డిసెంబర్ ఒకటో తేదీ నాటికీ టైగర్ 3 మొత్తం గ్రాస్ 463 కోట్లు. ఇది పూర్తిగా వాస్తవం కాకపోవచ్చని బాలీవుడ్ విశ్లేషకులు ఒక పక్క అంటున్నారు కానీ కలెక్షన్లకు సహేతుకమైన ఆధారాలు ఇవ్వరు కాబట్టి ఈ ఫిగర్లనే ప్రామాణికంగా తీసుకోవాలి.
ఇక అసలు పాయింట్ కు వస్తే యానిమల్ కేవలం మూడు రోజులకే 350 కోట్లు దాటేసింది. నిన్న గ్లోబల్ బాక్సాఫీస్ టాప్ 1 స్థానం దక్కించుకుంది. టైగర్ 3 నాలుగో వారం దాకా వసూలు చేసిన మొత్తాన్ని కేవలం ఫస్ట్ వీకెండ్ అయ్యేలోపే చేరుకోవడం చిన్న విషయం కాదు. దశాబ్దాల అనుభవమున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని రన్బీర్ కపూర్ ఇంత సులభంగా ఓవర్ టేక్ చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. టికెట్ రేట్లు అందుబాటులో ఉంచడం వల్లే తన సినిమాలకు పెద్ద నెంబర్లు కనిపించవని సల్మాన్ ఖాన్ ఇటీవలే ఒక స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
యానిమల్ కు కూడా ఎలాంటి పెంపులు, మినహాయింపులు ఇవ్వలేదు. అయినా సరే అరాచకానికి స్పెల్లింగ్ రాయిస్తోంది. టైగర్ 3కి ఖర్చు పెట్టినంత బడ్జెట్ సందీప్ వంగా కానివ్వలేదు. అయినా ఇంత గొప్ప విజయం నమోదు చేసుకోవడం ఒక రకంగా చరిత్ర సృష్టించడం లాంటిది. పదే పదే గొప్పలు చెప్పుకున్న సల్మాన్ ఖాన్ ని రన్బీర్ కపూర్ సులభంగా దాటేయడం చూసి కొత్త జనరేషన్ సూపర్ స్టార్ ఎవరో అర్థమైపోతోందని యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. దాదాపు ఫైనల్ రన్ కు చేరుకున్న టైగర్ 3 నామమాత్రంగా థియేటర్లలో ఉంది కానీ ఆక్యుపెన్సీలు కనిష్ట స్థాయి కంటే కిందకు పడిపోయాయి.
This post was last modified on December 4, 2023 9:04 pm
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి సరికొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి 'తెలుగు తల్లికి జల హారతి' అనే పేరును…
పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కొద్దిరోజుల క్రితం బేబీ జాన్ ప్రమోషన్లలో నిర్మాత అట్లీ మాట్లాడుతూ రన్బీర్ కపూర్ కి యానిమల్ ఎలా అయితే సూపర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా ఆయన అభిమానులు సినిమాల గురించి నినాదాలు చేయడం…
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్…
సహజంగా అధికారంలో ఉన్నవారికి ఫోన్లు రాకతప్పదు.. వారు ఆన్సర్ చేయకా తప్పదు. కానీ, తనకు ప్రతి శుక్రవారం ఫోన్లు వస్తున్నాయని..…