కెజిఎఫ్ లో హీరో రాఖీ భాయ్ క్యారెక్టర్ ని ఉద్దేశించి ఒక డైలాగు ఉంటుంది. బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుకుంటున్నారని ఒక డాన్ అంటాడు. యష్ పాత్రని వర్ణించడానికి ప్రశాంత్ నీల్ వాడిన అతి పెద్ద ఎలివేషన్ మాటలివి. ఇదిప్పుడు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ కి అక్షరాలా వర్తిస్తుంది. యానిమల్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాని అవుట్ ఫుట్ ని ఎన్నింతలు పెంచిందో థియేటర్ డాల్బీ సౌండ్ లో ఆస్వాదించిన ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా రన్బీర్ బావను చంపే ఎపిసోడ్, పంజాబ్ వెళ్లి తండ్రి రక్షణ కోసం రేంజ్ రోవర్ కార్లతో తోబుట్టువులను తీసుకొచ్చే సన్నివేశంలో మాములు పనితనం చూపించలేదు.
చెప్పుకుంటే కేవలం బీజీఎమ్ వల్ల మాములు సీన్లు కూడా అద్భుతంగా తెరమీద ఎలివేట్ అయ్యాయి. అర్జున్ రెడ్డికి పాటలు కంపోజ్ చేసింది రధన్ అయినా నేపధ్య సంగీతం సమకూర్చిన హర్షవర్ధన్ కి అంతకు మించి పేరు వచ్చింది. అయితే తన క్యాలిబర్ కు తగ్గ అవకాశాలు రాకపోవడమే విచిత్రం. టాప్ గేర్, ప్రెజర్ కుక్కర్, రాజు గారి కిడ్నాప్, సాక్ష్యం, విజేత లాంటి ఫ్లాప్ మూవీస్ వల్ల ఇతని కెపాసిటీ పూర్తి స్థాయిలో బయట పడటం లేదు. దుల్కర్ సల్మాన్ కనులు కనులను దోచాయంటేలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దన్నుగా నిలవడం వల్లే దాని విజయం స్థాయి కొన్నింతలు పెరిగింది.
రవితేజ రావణాసుర లాంటి పెద్ద అవకాశాలు వచ్చినా హర్షవర్ధన్ కి సరైన బ్రేక్ కాలేకపోయాయి. టాలీవుడ్ లో ఎంతసేపూ పెద్ద హీరోలు తమన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ అంటూ రెండే ఆప్షన్లు పెట్టుకుంటున్నారు. డేట్లు లేవు మహాప్రభో అన్నా అనిరుద్ రవిచందర్ లాంటి వాళ్ళ వెంటపడుతున్నారు. కానీ హర్షవర్ధన్ కు మాత్రం టైర్ వన్ స్టార్ల నుంచి పిలుపు రాలేదు. కానీ యానిమల్ లెక్కలన్నీ మార్చేస్తోంది. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్ల వర్షం కురుస్తోంది. భారీ అడ్వాన్సులతో లాక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చూస్తుంటే మనం తన విలువ గుర్తించే లోపే దొరకనంత బిజీ అయ్యేలా ఉన్నాడు.
This post was last modified on December 3, 2023 11:01 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…