కొత్త సినిమాల విడుదల విషయంలో నిర్మాతలెప్పుడూ పోటీదారుని తక్కువంచనా వేయకూడదు. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే ఎక్కువ ఊహించుకుంటే వసూళ్లలో దెబ్బ పడుతుంది. యానిమల్ మీద విపరీతమైన బజ్ ఉన్నా సరే చూసుకుందామని డిసెంబర్ 1నే రిలీజైన సామ్ బహద్దూర్ కి రివ్యూలు, టాక్స్ ఎంత పాజిటివ్ గా వచ్చినా కలెక్షన్లు మాత్రం ఆశించినంత వేగంగా లేవు. మొదటి రెండు రోజులకు కేవలం 15 కోట్లు దాటేసి అసలైన అగ్ని పరీక్షను సోమవారం నుంచి ఎదురుకోనుంది. యానిమల్ ఏకంగా 236 కోట్ల గ్రాస్ తో నిర్మాతలనే కాదు ట్రేడ్ మతులు కూడా పోగొట్టింది.
ఒకపక్క ముంబై లాంటి నగరాల్లో యానిమల్ కు అర్ధరాత్రి 12 నుంచి 2 మధ్యలో ఏకధాటిగా షోలు వేస్తుండగా మల్టీప్లెక్సులు ఇరవై నాలుగు గంటల పద్ధతిలో స్టాఫ్ కి షిఫ్టులు వేసి మరీ పని చేస్తున్నాయి. వాటి మేనేజర్లు ఏకంగా ఇంటికి వెళ్లకుండా థియేటర్లోనే ఉండాల్సిన పరిస్థితి. కానీ సామ్ బహద్దూర్ కు మాత్రం రెగ్యులర్ షోలు ప్రధాన కేంద్రాల్లో మంచి ఆక్యుపెన్సీ చూపిస్తుండగా బిసి సెంటర్లలో ఎదురీదాల్సి వస్తోంది. పీరియాడిక్ బయోపిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. మేఘన గుల్జార్ దర్శకత్వం ప్రశంసలు అందుకుంది.
ఒకవేళ సామ్ బహద్దూర్ కనక సోలోగా వచ్చి ఉంటే ఖచ్చితంగా మెరుగైన ఫలితాన్నే అందుకుని ఉండేది. కానీ యానిమల్ మేనియా అన్ని చోట్లా కమ్మేయడంతో సైడ్ తీసుకోక తప్పలేదు. ఇంత తాకిడిలోనూ పదిహేను కోట్లు రావడం మంచిదే. సండే ఒక్కటి కాస్త గట్టిగా పోరాడగలిగితే గట్టెక్కుతుంది. చాల చోట్ల యానిమల్ ఓవర్ ఫ్లోస్ సామ్ బహద్దూర్ కి కలిసి వస్తున్నాయి. నిజానికి రన్బీర్ కపూర్ సినిమా ఇంత అరాచకం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అందుకే విక్కీ కౌశల్ బృందం ధైర్యంగా అడుగు వేసింది. తీరా చూస్తే కలెక్షన్లలో వచ్చిన కోత, పాజిటివ్ టాక్ తో సర్దుకోవాల్సిన పరిస్థితి.
This post was last modified on December 3, 2023 1:18 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…